26-05-2025 01:05:40 AM
కడ్తాల్, మే 25 : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను అమనగల్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కడ్తాల్, అమనగల్ వరకు సిటీ సబర్బన్ బస్సులు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.
అదే విదంగా కడ్తాల్ - షాద్ నగర్ మార్గంలో షాద్ నగర్ డిపో సర్వీసులు నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. కడ్తాల్ పట్టణంలో బస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలని మంత్రిని కోరినట్లుతెలిపారు.