26-05-2025 01:07:53 AM
రాజేంద్రనగర్, మే 25: అక్రమార్కుల నీ ళ్ల దందా ఏ మాత్రం ఆగడం లేదు. మళ్లీ దర్జాగా కొనసాగుతుంది. రెవెన్యూ అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటు న్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా రోజులుగా గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని వట్టినాగులపల్లి లో దర్జాగా నీళ్లదందా సాగడంతో కొన్ని రోజుల క్రితం మీడియాలో కథనాలు వచ్చాయి.
అప్పట్లో స్పందించిన రెవెన్యూ అధికారులు నామమాత్రపు దాడులు నిర్వహించి తూతూమంత్రపు చర్యలు తీసుకున్నా రు. దీంతో అక్రమార్కులు తిరిగి తమ దం దా ప్రారంభించారు. ఎప్పటిలాగే ’మూడు పువ్వులు.. ఆరు ట్యాంకర్లు’ అన్న విధంగా దందా సాగుతోంది.
బెదరని అక్రమార్కులు
వట్టినాగులపల్లి గ్రామం చుట్టూ అక్రమార్కులు బోర్లు వేసుకుని వాటిలో నుంచి ని రంతరాయంగా 24 గంటలు నీళ్లు తోడుతూ గుంతలు తవ్వి వాటిలో మందమైన పాలిథిన్ కవర్లు వేస్తూ నీటిని పెద్ద మొత్తంలో నిల్వ ఉంచుతున్నారు. పదుల సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా వాటిని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నా.. అడిగే నాథుడు కరువయ్యారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రహదారి నుంచి పట్టినాగులపల్లి గ్రామంలోకి ప్రవేశించగానే కుడి వైపు తో పాటు కొ ద్ది దూరం వెళ్ళగానే ఎడమవైపునకు అక్రమ దందాలు కొనసాగుతున్నాయి. అదే విధం గా గ్రామం చుట్టూ కూడా బోర్లు, వాటితోపాటు నీటి నిల్వ కేంద్రాలు దర్జాగా కొనసా గుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయా కేంద్రాల నిర్వాహకులు 24 గంటల పాటు భూగర్భం నుంచి నీళ్లను తోడుతూ నిల్వ చేస్తున్నారు.
ఆపై ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానాక్ రామ్ గూడ, గచ్చిబౌలి, గోపన్ పల్లి తదితర ప్రాంతాలకు తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. గతంలో దాడులు నిర్వహించిన రెవెన్యూ అధికారులు నామమాత్ర పు చర్యలు తీసుకోవడంతో అక్రమార్కులు మళ్లీ పెట్రేగిపోతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
గ్రామంలో నుంచి నిరంతరంగా వివిధ ప్రాంతాలకు నీళ్ల ట్యాంకర్లు తిరగడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యపు మత్తు వీడి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని వట్టినాగులపల్లి గ్రామంలో జరుగుతున్న నీళ్ల తందా వ్యవహారంపై గండిపేట మండలం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరినీ ఉపేక్షించేది లేదనిపేర్కొన్నారు.