30 March, 2026 | 2:35 AM

సీసీ రోడ్లను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

30-03-2026 12:21 AM

మునిపల్లి, మార్చి 29ః మండల పరిధిలోని పోల్కంపల్లి, మేళాసంగం గ్రామాలకు మంజూరైన సీసీ రోడ్డు పనులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ ఆదేశాల మేరకు ఆదివారం రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సీసీ రోడ్డు మంజూరు చేసిందని తెలిపారు.

పనులు సకాలంలో నాణ్యతతో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు వీరే శం, లక్ష్మి, మాజీ సర్పంచ్ నాగమణి, వార్డు సభ్యులు, నాయకులు సంగయ్య, అంజయ్య, తక్కడపల్లి సంగమేశ్వర్, సదాశివులు, మల్లన్న, పాపయ్య, సంగమేష్, మల్లేశం, మొగులమ్మ తదితరులు పాల్గొన్నారు.