06-08-2025 12:00:00 AM
బాంబుపేలి వ్యక్తికి తీవ్రగాయాలు
చర్ల, ఆగస్టు 5 (విజయక్రాంతి): చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ ఐ ఈ డి పేలుడు కారణంగా గ్రామస్థుడు తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్థుడు ప్రమోద్ కాకేం (24) ఇల్మిడి నివాసి, గుంజెపర్తి గ్రామంలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు.
మంగళవారం ఉదయం సుమారు 8.00 గంటల సమయంలో స్నానం చేయడానికి కాలువ వద్దకు వెళ్లిన ప్రమోద్ కాంకే అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ముందుగా అమర్చిన ప్రెజర్ ఐ ఈ డి బాంబు పేలుడు కారణంగా, గ్రామస్థుడుకి రెండు అరచేతులలో తీవ్రంగా గాయాలయ్యాయి, గాయపడిన క్షతగాత్రున్ని . ప్రథమ చికిత్స అందించిన తర్వాత ఉసూర్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
సాధారణ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి అడవులు , సున్నితమైన ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా అనుమానాస్పద వస్తువు, వ్యక్తి లేదా కార్యకలాపాలను చూసినట్లయితే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా భద్రతా దళ శిబిరానికి తెలియజేయండనీ పోలీసు ఉన్నత అధికారులు తెలియజేస్తున్నారు.