calender_icon.png 31 December, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నట్టల నివారణ మందును సద్వినియోగం చేసుకోవాలి

31-12-2025 12:03:50 AM

నవాబ్ పేట, డిసెంబర్ 30: గాలి కుంటు వ్యాధి నుంచి రక్షించుకునేందుకు పశువులకు, గొర్రెలు,మేకలకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలను తప్పనిసరిగా వేయించాలని గురుకుంటా   గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి అన్నారు. గురుకుంటా ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన  నట్టల నివారణ టీకాలు అందించే కార్యక్రమాన్ని సర్పంచి ప్రారంభించి మాట్లాడారు.

కార్యక్రమాన్ని పశువుల పెంపకం దారులు సద్వినియోగం చేసుకొవాలని  తెలియజేశారు. గురుకుంట ఉప సర్పంచ్ రాజశేఖర్, 3వ వార్డ్ మెంబర్ హరీశ్వర్ రెడ్డి, యాదగిరి రెడ్డి, వెంకయ్య, వెంకటేష్, గణేష్, రాజు, రాములు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.