06-12-2025 12:00:00 AM
-నేడు విశాఖలో భారత్, సౌతాఫ్రికా చివరి వన్డే
- 1- సమంగా ఉన్న ఇరు జట్లు
- భారత తుది జట్టులో మార్పులు లేనట్టే
- విశాఖలోనూ పరుగుల వరదే
విశాఖపట్నం, డిసెంబర్ 5: భారత్ , సౌతాఫ్రికా మధ్య వన్డే సిరీస్ రసవత్తర ము గింపునకు చేరింది. విశాఖ వేదికగా చివరి మ్యాచ్‌తో ఫలితం తేలబోతోంది. రాంచీలో గెలిచి రాయ్పూర్లో ఓడిన భారత్.. వైజాగ్లో దు మ్మురేపి సిరీస్ విజయా న్ని అందుకోవాలని భావిస్తోంది. రెండో వన్డే లో 358 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయి న భారత్.. తప్పిదాలపై ఫోకస్ పెట్టిం ది. దీనిలో భాగంగా బౌలింగ్ , ఫీల్డింగ్ లో మెరుగుపడాలి. ఇదిలా ఉంటే భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం లేదు.
రుతురాజ్ గైక్వాడ్ గత మ్యాచ్ లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరోవైపు శుభ్మన్ గిల్ గైర్హాజరీలో వచ్చిన అవకాశాల ను యశస్వి జైస్వాల్ అందిపుచ్చుకోలేకపోయాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమ య్యాడు. అయితే మూడో వన్డేలో అతనికి ఆఖరి అవకాశం దక్కనుంది.ఒకవేళ జైస్వా ల్ను తప్పించాలనుకుంటే రుతురాజ్ గైక్వా డ్ను ఓపెనర్గా ఆడించాల్సి ఉంటుంది. ఆ సాహసం గంభీర్ చేయకపోవచ్చు. ఇప్పటికే బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన ప్రయోగాలపై సర్వ త్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో రిషభ్ పంత్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్ బెంచ్కే పరిమితమవ్వాలి. విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉండగా.. రోహిత్ శర్మ చెలరేగాల్సి ఉంది. రుతురాజ్ కూడా తన జోరు ను కొనసాగిస్తే భారత్కు తిరుగుండదు. తెలు గు తేజం, నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కడం డౌట్ గానే ఉంది. ఒకవేళ నితీష్ ఆ డించాలనుకుంటే వాషింగ్టన్ సుంద్ప వేటు పడుతుంది. తొలి రెండు వన్డేల్లో సుందర్ అంచనాలను అందుకోలేకపో యాడు. కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్లో ఉండగా.. రవీంద్ర జడేజా ఫినిషర్ పాత్ర పోషించాల్సి ఉంది.
స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ సత్తా చాటాలి. రెండో వన్డేలో విఫలమైన భారత పేసర్లు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ మెరుగ్గా బౌలిం గ్ చేయాలి. ఫీల్డింగ్ కూడా మెరుగుపడాలి. అప్పుడే భారత్కు విజయం సాధ్యమవుతుం ది. ముఖ్యంగా పేసర్లు అస్సలు ఫామ్ లో లేరు. పేసర్లు స్థాయికి తగినట్టు రాణించకుంటే మాత్రం సిరీస్ పై ఆశలు వదులు కోవాల్సిందే. మరోవైపు భారత్ గడ్డపై మరో సిరీస్ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని వదులుకోకూడదని సౌతాఫ్రికా ఉవ్వి ళ్లూరుతోంది.
గత రికార్డులు
విశాఖలో భారత జట్టు ఇప్పటి వరకు 10 వన్డే మ్యాచ్లు ఆడింది. 7 మ్యాచ్ల్లో గెలిచి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో స్టేడియం భారత ఫేవరెట్ మైదానాల్లో ఒకటిగా మారింది.
చివరి వన్డేకు భారత తుది జట్టు (అంచనా)
జైస్వాల్, రోహిత్ శర్మ, కోహ్లీ, రుతురాజ్/పంత్, నితీశ్ కుమార్‌రెడ్డి, రాహు ల్, జడే జా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్/ప్రసిద్ధ కృష్ణ టెస్ట్ సిరీస్‌లో వైట్ వాష్ పరాభవానికి రివేంజ్ తీర్చుకునే క్రమంలో తొలి వన్డే గెలిచి ఆరంభం అదరగొట్టిందనుకుంటే..తర్వాతి మ్యాచ్‌లో షాక్...అది కూడా భారీ స్కోర్ చేసి ఓటమి చవిచూడాల్సి వచ్చింది..ఇపుడు సిరీస్ విజ యాన్ని తేల్చే చివరి మ్యాచ్..బౌలర్లు మెరుగుపడితే తప్ప గెలుపును ఆశించలేని పరిస్థితి..మరి సఫారీల జోరుకు బ్రేక్ వేసి టీమిండియా సిరీస్ చేజిక్కించుకుంటుందా ?