calender_icon.png 16 August, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మర్వాడీ గో బ్యాక్ అంటే.. రోహింగ్యా గో బ్యాక్ ఉద్యమం చేస్తాం

16-08-2025 12:16:11 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి): “మీరు మర్వాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే, మేం హిందూ కుల వృత్తులను కాపాడుకోవడంతో పాటు, ‘రోహింగ్యా గో బ్యాక్’ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం” అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. మ ర్వాడీ గో బ్యాక్ నినాదం వెనుక హిందూ సమాజాన్ని చీల్చేందుకు కమ్యూనిస్టుల ము సుగులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీ లు ఆడుతున్న డ్రామా అని ధ్వజమెత్తారు.

శుక్రవారం యూసుఫ్‌గూడలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అలాంటి వారిని ఎం దుకు వెళ్ళిపోవాలని అంటారు? ఇది హిం దూ సమాజాన్ని విభజించే కుట్ర అని ఆరోపించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన రోహింగ్యాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐ ఎం ఎందుకు మాట్లాడటం లేదని సంజయ్ ప్రశ్నించారు.

పాతబస్తీని ఐఎస్‌ఐ అడ్డాగా మార్చి రోహింగ్యాలు కార్యకలాపాలు సాగిస్తున్నారని నివేదికలు వస్తున్నాయని, వారిని వెనక్కి పంపాలని ఉద్యమిస్తామని చెప్పారు. కాగా ఓట్ల చోరీ తాము చేస్తే.. 240 ఎంపీ సీట్లే ఎందుకు వస్తాయి అని, కాంగ్రెస్ తెలంగాణ, కర్ణాటకలో ఎలా గెలుస్తుంది అని నిలదీశారు.