16-08-2025 05:16:39 PM
ఈవిఆర్ ఫౌండేషన్ చైర్మన్ —యర్కచర్ల శివకుమార్
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలో గత నెల 30న మరణించిన తడకమళ్ళ. పెద వెంకన్న–రాములమ్మ మరణించి అనాధలైన పిల్లల విషయం సోషల్ మీడియాలో చూసి చలించిపోయి తల్లిదండ్రులు కోల్పోయిన కుటుంబ అనాధ పిల్లలకి చేయూతను అందించడం కోసం ఇవి ఆర్ ఫౌండేషన్ అధినేత ఎర్కచర్ల శివకుమార్ తుంగతుర్తి కి వచ్చి వారికి ఆర్థిక సాహయం పదివేల రూపాయలు అందించడం జరిగింది. పెద్ద కూతురు తడకమల్ల ఉమకి జిఎన్ఎమ్ చేయడం కోసం కాలేజీలో మాట్లాడుతానని హామీ ఇవ్వడం జరిగింది. స్థానిక ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి వారి దత్తత తీసుకోవాలని శివ కుమార్ గారు కోరారు.