16-08-2025 05:14:12 PM
రేగొండ,(విజయక్రాంతి): బిజెపి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడిగా దాసరి తిరుపతిరెడ్డి ని నియమించినట్లు బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నూతల నిశీధర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని రాయపల్లి గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి ని రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు ఆదేశాల మేరకు నియామకం చేసినట్లు నిషిధ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దాసరి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ 1988లో విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ, బిజెపిలో పనిచేస్తూ వచ్చానని తెలిపారు.1991లో అయోధ్య సమస్యలపై కేసులు ఎదుర్కొన్నానని అన్నారు. వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా కూడా పనిచేశానని, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా సేవలందించినట్లు తెలిపారు.
మండలంలో పలుసార్లు మండల అధ్యక్షునిగా నియామకమై పార్టీ అభివృద్ధి కోసం అహర్నిహాలు కృషి చేస్తున్నానని తెలిపారు. నన్ను గుర్తించి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి, నాయకులు సత్యపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశీదర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగపురి రాజమౌళి గౌడ్, నాయకులు వెన్నంపల్లి పాపయ్య, చదువు రామచంద్రారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నె మొగిలి, పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కులసాని తిరుపతిరావు, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.