calender_icon.png 23 August, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్వాడీ వ్యాపారి హటావో

23-08-2025 12:39:54 AM

  1. తెలంగాణవ్యాప్తంగా ఊపందుకున్న ఉద్యమం
  2. ఓయూ జేఏసీ పిలుపుతో స్వచ్ఛందంగా బంద్ పాటించిన స్థానిక వ్యాపారులు
  3. తమ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నారని ఆవేదన
  4. హోరెత్తిన మార్వాడీ వ్యాపారి గో బ్యాక్ నినాదాలు
  5. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కార్యక్రమాలు, బైక్‌ర్యాలీలు

విజయక్రాంతి నెట్‌వర్క్, ఆగస్టు 22: తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీ వ్యాపారి గోబ్యాక్ ఉద్యమం రాజుకుంది. మార్వాడీ వ్యాపారులతో స్థానికుల ఉపాధి అవకాశా లు దెబ్బతింటున్నాయన్న కారణంతో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పలుచోట్ల స్థానికులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఓ యూ జేఏసీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మొదలైన ఈ నినాదం..

ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు పాకింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మార్వాడీ వ్యా పారస్తులకు వ్యతిరేకంగా అనేక చోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. నల్లగొండ జి ల్లా కేంద్రంలో స్థానిక వ్యాపారులు వందల మందితో బైక్ ర్యాలీ చేపట్టారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించకూడదంటూ  టూటౌన్ ఎస్‌ఐ సైదులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో వ్యాపారులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఆందోళనలో పాల్గొన్న వ్యాపారులను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ స్థానిక వ్యా పారులు నినదించారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని మార్వాడీ వ్యాపారుల అరాచకాలను ఆపాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌లో స్థానిక వర్తక, వ్యాపార వాణిజ్య సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. రాజస్థాన్, గుజరాతీ మార్వాడీలు అన్ని వ్యాపారాల్లో చాపకింద విస్తరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నల్లగొండ జిల్లా నకిరేకల్, కట్టంగూ రు తదితర ప్రాంతాల్లో చేపట్టిన బంద్ విజయవంతమైంది. నాసిరకం వస్తువులు అ మ్ముతూ తెలంగాణ ప్రజలను మోసగిస్తున్నారని స్థానిక వ్యాపారులో వాపోయారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పట్టణ కేంద్రం లో మార్వాడీ వ్యాపారి గో బ్యాక్ నినాదాలు హోరెత్తాయి. ఆంధ్రా పాలకులతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో మార్వాడీ వ్యా పారులు స్థానికుల వ్యాపారుల హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓయూ జేఏసీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో వృత్తిదారుల సంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా స్థానిక స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు బాలచారి, మనుమయ సంఘం అధ్యక్షుడు గడి యారం వెంకటచారి మాట్లాడుతూ తెలంగా ణ సంపదనంతా గుజరాత్, రాజస్థానీ మా ర్వాడీలు కొల్లగొడుతున్నారని, దీంతో స్థానిక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మార్వాడీ వ్యాపారి మా ఫియాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చే శారు. మార్వాడీ వ్యాపారులు తెలంగాణలో ని ప్రతి పల్లెకు విస్తరించి, స్థానిక వృత్తుల మీద ముప్పేట దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం వెంటనే మా ర్వాడీ వ్యాపారి నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు. రాష్ట్రబంద్‌లో భాగంగా అదుపులో తీసుకున్న తెలంగాణ ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలన్నారు.

మార్వాడీ వ్యాపారి మాఫియాకు అడ్డుకట్ట వే యాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనూ పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక సిమెంట్, ఐరన్ హార్డ్‌వేర్, శానిటరీ, పెయిట్స్, ఫ్లువుడ్, ఎలక్ట్రికల్ వ్యాపారుల సంఘం సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొబైల్ దుకాణాలు నిర్వహాకులు మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు.

మార్వాడీ వ్యాపారులు నాసిరకం వస్తువులను తెలంగాణ ప్రజలకు రుద్దుతున్నారని, వారి సంస్కృతిని మనపై బలవంతంగా రుద్దుతున్నారని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోనూ మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. ఫ్లకార్డులు చేతబూని ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పలువురు సెల్‌షాప్ నిర్వాహకులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి, నల్లబ్యాడ్జీలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేకపోవడంతో సీఐ మహేందర్‌రెడ్డి పలువురు నిరసనకారులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.