04-08-2025 12:03:10 AM
రవితేజ ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రస్తుతం అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఇప్పుడు ఆయన తన 75వ సినిమా ‘మాస్ జాతర’ కోసం పనిచేస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.
దాదాపు చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి ‘ఓలే.. ఓలే..’ అనే పాటను విడుదల చేయనున్నట్టు తెలిపింది. సోమవారం ఉదయం ఈ సాంగ్ ప్రమోను రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించింది.
పూర్తి లిరికల్ సాంగ్ ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ మేరకు విడుదల చేసిన సాంగ్ ప్రోమో అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సినిమా విడుదల తేదీ ‘ఆగష్టు 27’ అని రాసి ఉండటంతో విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకూ ఓ క్లారిటీ వచ్చినట్టయ్యింది.