04-08-2025 12:02:03 AM
పుస్తకం హస్తకభూషణం అన్న మాట మరిచిన యువత.. ఆ పుస్తకానికి మాదక ద్రవ్యా లను బాసికంగా అలంకరిస్తోంది. పుస్తకాలు ఉండాల్సిన వారి బ్యాగుల్లోకి మాదక ద్రవ్యాలు దూరుతున్నా యి. డిగ్రీ పట్టాలు పొందాల్సిన వయసులో డ్రగ్స్‌కు బానిసై థర్డ్ డిగ్రీని ఎదుర్కొనే పరిస్థితిని ‘కొని’ తెచ్చుకుంటున్నారు. ఉద్యోగాలు చేయాల్సిన వయసులో ఊచలు లెక్కపెట్టే స్థితికి చేరుకుంటున్నారు.
యువత ను తన బానిసగా మార్చుకుంటున్న డ్రగ్స్‌ను వారి జీవితాల్లో నుంచి తరిమేసే కార్యం ఏ మాధ్యమం రూపంలో చేసినా మెచ్చుకోదగ్గదే. తనకు తెలిసిన సినిమా అనే అస్త్రాన్ని డ్రగ్స్ మహమ్మారిపై సంధిస్తున్నారు హీరో కృష్ణసాయి. ఇందులో భాగంగా కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ నిర్మాణంలో ‘ఓ యువతా నీ గమ్యం ఎటు వైపు?’ అనే సందేశంతో రూపొందించిన ప్రచార వీడియోకు మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆవరణలో హీరో కృష్ణసాయి ఆదివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. హీరో కృష్ణసాయి మాట్లాడుతూ.. “తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు, మా బాధ్యతగా డ్రగ్స్‌పై ఓ చైతన్యపూరిత గీతాన్ని రూపొందించాం. ప్రతి సినిమాకు ముందు ‘స్మోకింగ్ డేంజర్’ అని చేసే హెచ్చరికల వల్ల యువతలో అవగాహన కలుగుతోంది. సిగరెట్, తంబాకు, గుట్కా వినియోగం బాగా తగ్గిపోయింది.
సినిమా మాధ్యమం వల్ల ప్రజలు ప్రభావితం అవుతారు. అందుకే డ్రగ్స్‌పై అవగాహన పెంపొందించేందుకు మేం ‘డేంజర్’ అనే సినిమాను రూపొందిస్తున్నాం. ఆ సినిమా కోసం చిత్రీకరించిన పాటను ప్రభుత్వంలో వివిధ స్థాయిలో ఉన్న ప్రముఖుకు చూపించాం. వాళ్ల ప్రశంసలు మాకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. ఆ ఉత్సాహంతోనే సినిమాను త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచన కల్పించింది.
మా ఈ పాట యువతను మార్పు దిశగా నడిపిస్తుందని నమ్మకం ఉంది” అన్నారు. ‘డేంజర్’ నటీనటులు: కృష్ణసాయి, పూజిత, మేక రామకృష్ణ, రమేశ్ గుత్తుల, నితీశ్, వెంకటేశ్వరరావు తదితరులు; సంగీతం: శంభు ప్రసాద్; గీత రచనాదర్శకత్వం: పీఎస్ నారాయణ; గానం: రమణ సీలం.