calender_icon.png 27 July, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాస్ ‘కరుప్పు’

24-07-2025 12:00:00 AM

తమిళ స్టార్ సూర్య ప్రస్తుతం తన 45వ చిత్రం కోసం పనిచేస్తున్నారు. ‘కరుప్పు’ అనే టైటిల్‌తో ఆర్జే బాలాజీ రూపొం దిస్తున్న మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో సూర్యకు జోడీగా త్రిష కృష్ణన్ నటిస్తోంది. ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి, శ్శివాడ, సుప్రీత్‌రెడ్డి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

ఇదిలా ఉండగా, బుధవారం కథానాయకుడు సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో హీరో సూర్య పవర్‌ఫుల్ అవతార్‌లో అదిరిపోయే లుక్‌తో కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి అభ్యంకర్; సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు; యాక్షన్: అన్బరివ్ విక్రమ్ మోర్; ఎడిటర్: ఆర్ కళైవానన్; నిర్మా తలు: ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు; దర్శకత్వం: ఆర్జే బాలాజీ.