calender_icon.png 17 November, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామూహిక వివాహాలు అభినందనీయం

17-11-2025 12:00:00 AM

  1. అచ్చంపేట శాసనసభ్యుడు డా.వంశీకృష్ణ

వేదమంత్రాల నడుమ ఒక్కటైన 64 జంటలు

అచ్చంపేట, నవంబర్ 16:  పేదింటి ఆడబిడ్డలు గొప్పగా పెళ్లి చేసుకోవాలనే ఉద్ధే శ్యంతో ఉచిత సామూహిక వివాహాలు జరిపించడం గొప్ప శుభ పరిమాణమని అచ్చం పేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ కొనియాడారు. ఇలాంటి సామాజిక సేవస్పూర్తి హర్షనీయమని ప్రశంసించారు. అప్పశివ జ్యువెలర్స్ అధినేత, అచ్చంపేట పురపాలిక కౌన్సిలర్ గోపిశెట్టి శివ, గాయత్రి దంపతులు అచ్చంపేటలోని ఓ పంక్షన్ హాల్లో ఆదివారం ఉచిత సామూహిక వివాహమహోత్సవ వేడుక నిర్వహించారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 64 జంటలు హస్తా నక్షత్ర యుక్త ధనుర్ లగ్న శుభపుష్కరంలో ఉద యం 10:38 గంటలకు అర్చకుల వేదమంత్రాల నడుమ ఒక్కటయ్యారు. కార్యక్ర మాని కి ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు డా.అనురాధ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన దపంతులకు నిర్వాహకులతో కలిసి కొత్త వస్త్రాలు అందజేశారు. అర్చకులు శాస్త్రోత్తకరంగా వివాహతంతును జరిపించారు.

నూతన దంపతులను ఎమ్మెల్యే దంపతులు, నిర్వాహుకుల దంపతులు ఒక్కో జంట దగ్గరికి వెళ్లి అక్షితలతో ఆశీర్వధించారు. వేడుక అనంతరం నవదంపతులకు బీరువా, మంచం, ఇతర ఇంటి సామాగ్రిని అందజేశారు. ఆయా వస్తువులను ఒక్కోకో ట్రాక్టర్ లో వారివారి ఇళ్లకు చేర్చారు. సాయంత్రం గుర్రంబగ్గీలో భారీ భరాత్ నిర్వహించారు. కల్యాణ మండపం నుంచి ఎన్టీఆర్ మినీ మైదానం వరకు భరాత్ కొనసాగింది. రహదారి పొడవునా నృత్యాలు, సంగీత, కోలాట ప్రదర్శనలు అలరించాయి. 

కోలాహాలంగా పట్టణం

ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించే కల్యాణ మండపాన్ని అందంగా ముస్తాబు చేశారు. ప్రవేశమార్గం ప్రాం గణం.. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నమూనాగా అలంకరించారు. లోపల కొబ్బరి ఆకులతో పెళ్లి వేదికలను సిద్ధం చేశారు. అర్చకులు శాస్త్రప్రకారం కన్యాధానం, సప్తపది, మాంగళ్యధారణ, అరుందతి నక్షత్ర దర్శనం వేడుక నిర్వహించారు.

ఉచిత సామూహిక వివాహాలను ప్రతీ ఒక్కరు తిలకించేందుకు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి పొడవునా స్తంబాలకు మైకులను అమర్చారు. పట్టణాన్ని రంగురంగు విధ్యుత్తుధీపాలతో అలంకరించారు. దీంతో పట్టణంలో పెళ్లి వేడుకలతో కోలాహాలంగా మారింది. పెళ్లికి వచ్చే వారి కోసం నిర్వాహకులు 15 రకాల ప్రత్యేక వంటకాలను సిద్ధం చేసి అందించారు. అందరి ఆశీస్సులతోనే ఉచిత సామూహిక వివాహాలను దిగ్విజయంగా పూర్తి చేయించానని నిర్వాహకులు గోపిశెట్టి శివ అభిప్రాయపడ్డారు.

తనకు సహకరించిన ఎమ్మెల్యేకు, సహచరులకు కృతజ్నతలు తెలిపారు. తన కుటుంబ సభ్యులు, ఇతరులు తన ఎదుగుదలకు అందించిన ప్రోత్సాహాన్ని గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీ యమని నిర్వాహకులను అభినందించారు. నూతన దంపతులకు పెళ్లి గొప్పదనం, ఇతర అంశాలను వివరించారు. అందరు సఖసంతోషాలతో జీవించాలని ఆశీర్వధించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.