17-11-2025 12:00:00 AM
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజాపూర్, నవంబర్ 16: అర్హులైన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఈద్గాన్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. అనంతరం రూ.26 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. గూడు లేని నిరుపేదల సొంత ఇంటి కలలను నిజం చేయడం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈద్గాన్ పల్లిలో 15 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం గ్రామంలో మరిన్ని ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
గ్రామాభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వ స్థాయిలో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఆమోదం పొందినట్లు వివరించారు. గ్రామానికి 46 కోట్ల రూపాయల వ్యయంతో ఏటీసీ ట్రైనింగ్ సెంటర్ మంజూరు కావడం శుభపరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాధాకృష్ణ, ఎంపీడీఓ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్, శ్రీనివాస్ నాయక్, విక్రమ్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సీపీ రోడ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి
రాజాపూర్ నవంబర్ 16: మండల కేంద్రంలోని పలు కాలనీలలో సిసి రోడ్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఆదివారం రాజాపూర్ మండల కేంద్రానికి విచ్చేసిన జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీసీ మంజూరు చేయాలని విన్నవించారు.
ఎమ్మెల్యే స్పందిస్తూ త్వరలోనే సిసి రోడ్ల మంజూరుకు కృషి చేయనున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్,గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్,రమేష్,విక్రమ్ రెడ్డి,శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.