22-01-2026 12:21:45 AM
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాటా
జిన్నారం/ అమీన్ పూర్, జనవరి 21గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని గడ్డపోతారం గ్రామ మాజీ ఉప సర్పంచ్ బైండ్ల లక్ష్మయ్య, కిష్టాయిపల్లి గ్రామ అధ్యక్షుడు బైండ్ల యాదగిరి, అమూల్య తమ అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు ఆయన కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో వరుస చేరికలు కొనసాగుతున్నాయని, వారందరికీ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభిస్తుందన్నారు.
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగటమే కాకుండా పేద, బడుగుబలహీన వర్గాలకు మహిళలకు, రైతులకు అండగా ఉండటంతో ప్రజలు కాంగ్రెస్ వైపు ఆకర్షిస్తున్నారని, గడ్డపోతారం మున్సిపాలిటీలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నాధీమాను కాటా శ్రీనివాస్ గౌడ్ వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, గడ్డపోతారం మాజీ ఎంపిటిసి జనాభాయ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు