09-10-2025 12:01:00 AM
ఏడుగురు సజీవ దహనం!
-పలువురికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
-మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు
-ఏపీలోని కోనసీమ జిల్లాలో దుర్ఘటన
రాయవరం, అక్టోబర్ 8: పటాకుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి ఏడుగురు సజీవదహనం అయ్యారు. అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందా రు. పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ గా ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు మహిళలతో పాటు పటాకుల తయారీ కేంద్రం యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణ మూర్తి కూడా ఉన్నట్లు అధికారు లు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం పేలుడు సంభవించి భా రీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయం లో పటాకుల కేంద్రంలో 40 మంది కూలీ లు పనిచేస్తున్నట్లు తెలిసింది. పేలుడు ధాటికి కేంద్రం షెడ్డుగోడ కూలి పడింది. శిథిలాల కింద మరికొందరు కూలీలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిని రామచంద్రాపురం ఆర్డీఓ అఖిల పరిశీలించారు. అధి కారులు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. ఘటనపై సీఎం చంద్రబా బునాయుడు, హోమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతుల సం ఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.