calender_icon.png 9 October, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైనిక చర్యను అడ్డుకున్నదెవరు?

09-10-2025 12:03:19 AM

-ఉగ్రదాడికి దీటుగా పాక్‌పై ఎందుకు దాడి చేయలేదు

-కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి

-పౌరుల రక్షణ, జాతీయ భద్రత కంటే ఏదీ ఎక్కువ కాదు

-అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్

-విదేశీ ఒత్తిడులకు తలొగ్గారని విమర్శ

-నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్ ప్రారంభించిన మోదీ

ముంబై, అక్టోబర్ 8( విజయక్రాంతి) : దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంపై 2008వ సంవత్సరంలో జరిగిన ఉగ్రదాడికి దీటుగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రతిస్పందించలేదని ప్రధాని నరేంద్ర మోదీ సూటిగా ప్రశ్నించారు. దాయాదిపై ఎందుకు దాడి చేయలేదు..? ఆ సమయంలో దాడికి సిద్ధంగా ఉన్న సైనిక చర్యను అడ్డుకుంటూ నిర్ణయం తీసుకుందెవరో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్ బుధవారం ప్రధాని ప్రారంభించారు.

ఆ తర్వాత జరిగిన సభలో కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. విదేశీ ఒత్తిడిలకు అప్పటి ప్రభుత్వం తలొగ్గిందని విమర్శించారు. ముంబై ఆర్థిక రాజధాని మాత్రమే కాదని, అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటని పేర్కొన్నారు. అందుకే ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని తెలిపారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ బలహీనతే ఉగ్రవాదులకు బలంగా మారిందని విమర్శించారు. పౌరుల రక్షణ..జాతీయ భద్రత కంటే ఏదీ ఎక్కువ కాదని ప్రధాని పేర్కొన్నారు. జాతీయ భద్రత విషయంలో అప్పటి ప్రభుత్వం రాజీపడిందని ఆయన ఆక్షేపించారు. పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలకు దిగకూడదని అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చిందని అప్పటి కేంద్ర హోంమంత్రి చిదరంబం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అంగీకరించిన విషయాన్ని ప్రధాని మోదీ పరోక్షంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు.  

నవీ ముంబై ప్రత్యేకతలు

అదానీ ఎయిర్‌పోర్ట్, సిడ్కో మధ్య ప్రబ్లి క్ ప్రైవేట్ భాగస్వామ్యంతో 19,650 కోట్ల వ్యయంతో ఆధునిక హంగుళతో నవీ ముం బై ఏయిర్‌పోర్టును నిర్మించారు. వార్షిక ప్ర యాణికుల సామర్థ్యం 9కోట్లు, హెవీ కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ 3.25 మిలియన్ మెట్రి క్ టన్నులు. ముంబై మెట్రో పాలిటన్ ప్రాం తంలో ఇది రెండో అంతర్జాతీయ ఎయిర్‌పో ర్టు. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో రద్దీని తగ్గించేందుకు బహుళ విమా నాశ్రయ వ్యవస్థ ద్వారా గ్లోబల్ సిటీస్ ప్రతిష్టను మరింత పెంచే లక్ష్యంతో నిర్మించారు.