03-07-2025 01:28:54 AM
9వేల మందిని తొలగించే అవకాశం
ముంబై, జూలై 2: టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఎంతమంది ఉద్యోగులపై వేటు పడనుందనే విషయాన్ని సంస్థ స్పష్టంగా చెప్పనప్పటికీ దాదాపు నాలుగు శాతం కంటే తక్కువ ఉద్యోగులపై ప్రభావం చూపనుందని పేర్కొంది. దీన్నిబట్టి ఈ సంఖ్య దాదాపు 9వేల వరకు ఉండొచ్చని సమాచారం.
జూన్ 2024 నాటికి 2.28 లక్షల మంది ఉద్యోగులు మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపులను మొదలుపెట్టిన టెక్ దిగ్గజం ఈ ఏడాది మే నెలలో ఆరు వేల మందికి లేఆఫ్‌లు ప్రకటించింది. తాజా గా మరోసారి పెద్ద ఎత్తున తొలగింపునకు సిద్ధమైంది.