26-05-2025 12:08:50 AM
కార్తి హీరోగా నటించిన ‘సర్దార్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. దీంతో దీనికి సీక్వెల్ రూపొందిస్తున్నారు. ‘సర్దార్2’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రీక్వెల్‌కు దర్శకత్వం వహించిన పీఎస్ మిత్రన్ ఈ రెండో భాగాన్నీ డెరెక్టర్ చేస్తున్నారు.
ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ కథానాయి కలుగా నటిస్తుండగా ఎస్‌జే సూర్య ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆదివారం కథానా యకుడు కార్తి పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
కార్తి మ్యాసి వ్ మిషన్ గన్ పట్టుకొని రగ్గడ్ లుక్‌లో కనిపించిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా; డీవోపీ: జార్జ్ సీ విలియమ్స్; స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్; ఎడిటర్: విజయ్ వేలుకుట్టి; సహ నిర్మాత: ఏ వెంకటేశ్; నిర్మాత: ఎస్ లక్ష్మణ్‌కుమార్; దర్శకత్వం: పీఎస్ మిత్రన్.