calender_icon.png 3 August, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటేదాన్‌లో దొంగల హల్ చల్..

21-07-2024 10:59:12 AM

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని కాటేదాన్ లో దొంగల హల్ చల్ చేశారు. బ్యాటరీ ఫ్యాక్టరీలో చొరబడి అల్మరా లో ఉన్న రూ. 50 లక్షలు ఎత్తుకెళ్లారు. వాచ్మెన్ కు కత్తితో బెదిరించి బీరువాలో ఉన్న డబ్బును దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగతనం చేసింది తెలిసిన వారేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కత్తులతో బెదిరించి దొంగతనం చేశారని చెబుతున్న వాచ్ మెన్ చెబుతున్నాడు. నిద్రపోతున్న ఇద్దరినీ బెదిరించి చోరీ చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకుని రంగం లోకి దిగిన క్లూస్ టీం దొంగల వేటలో పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.