calender_icon.png 3 August, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్తాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

21-07-2024 11:05:50 AM

అత్తాపూర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని అత్తాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. ఓ సాప్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్ చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని సుధీర్ రెడ్డిగా గుర్తించారు. మూడు సంవత్సరాల క్రితం సుధీర్ రెడ్డికి తన సొంత మరదలితో వివాహం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం సుధీర్ రెడ్డి సూసైడ్ కు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.