18-01-2026 01:33:47 AM
20 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు
ఫ్యూచర్ సిటీకి అధికారుల నియామకం
హైదరాబాద్ ట్రాఫిక్ బాధ్యతలు యువ ఐపీఎస్‌లకు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (విజయక్రాంతి): పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ పోలీసు శాఖలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 20 మంది ఐపీఎస్, నాన్-క్యాడర్ ఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి కె రామకృష్ణారావు జీవో జారీ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అడిషనల్ సీపీ అడ్మిన్, ట్రాఫిక్‌గా సీనియర్ ఐపీఎస్ అధికా రిణి జి చందన దీప్తిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆమె రైల్వే ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ములుగు అడిషనల్ ఎస్పీగా ఉన్న శివం ఉపాధ్యాయను ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీగా బదిలీ చేశారు.
డా. గజారావు భూపాల్.. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా ఉన్న ఆయనను ప్రొవిజనింగ్, లాజిస్టిక్స్ ఐజీగా బదిలీ చేశారు. స్పోర్ట్స్, వెల్ఫేర్ ఐజీగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. అభిషేక్ మొహంతి.. నార్కోటిక్స్ బ్యూరో నుంచి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఐజీగా బదిలీ అయ్యారు. ఆర్. భాస్కరన్.. ఇంటెలిజెన్స్ ఎస్పీ నుంచి అదే విభాగంలో సీఐ సెల్ డీఐజీగా పదోన్నతి పొందారు. టి. అన్నపూర్ణ.. విజిలెన్స్ ఎస్పీ నుంచి సైబరాబాద్ అడ్మిన్ డీసీపీగా వెళ్లారు. కె. అపూర్వ రావు.. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ డీసీపీ నుంచి ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు. బి. బాలస్వామి.. ఈస్ట్ జోన్ డీసీపీగా ఉన్న ఈయనను విజిలెన్స్ ఎస్పీగా నియమించారు. ఆర్. వెంకటేశ్వర్లు..ట్రాఫిక్ డీసీపీ నుంచి సీఐడీ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఎస్. చైతన్య కుమార్.. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ నుంచి హైదరాబాద్ క్రైమ్స్, డీడీ డీసీపీగా బదిలీ అయ్యారు. హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫి క్ విభాగాన్ని పటిష్టం చేసే దిశగా 2021 బ్యాచ్‌కు చెందిన యువ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
అవినాష్ కుమార్ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా, కాజల్.. హైదరాబాద్ ట్రాఫిక్ -2 డీసీపీగా, రాహుల్ హెగ్డే ట్రాఫిక్-3 డీసీపీగా, శేషాద్రిని రెడ్డి.. సైబరాబాద్ ట్రాఫిక్-2 డీసీపీగా, కంకనాల రాహుల్ రెడ్డి.. మల్కాజిగిరి ట్రాఫిక్-1 డీసీపీగా, జె. రంజన్ రతన్ కుమా ర్.. సైబరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీగా, వి. శ్రీనివాసులు.. మల్కాజిగిరి ట్రాఫిక్-2 డీసీపీగా, డీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు కె. శ్యామ్ సుందర్ను, విజిలెన్స్ అడిషనల్ ఎస్పీగా పి. అశోక్ను నియమించారు. విజిలెన్స్ లో ఉన్న ఏ. బాలకోటిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. బదిలీ అయిన అధికారులంతా తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.