calender_icon.png 18 January, 2026 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం హామీ అటకెక్కింది

18-01-2026 01:35:26 AM

అమలవుతున్నది 31 శాతమే

మున్సిపల్ ఎన్నికల్లోనూ బీసీలకు మొండిచేయే

15 శాతం ఉన్నోళ్లకు 61 చైర్మన్ సీట్లా?

రేపు రాష్ర్టవ్యాప్తంగా నిరసనలు

బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ లకు తీరని అన్యాయం చేసిన రాష్ర్ట ప్రభుత్వం.. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ద్రోహాన్ని పునరావృతం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్ జాజు ల శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హా మీ ఇచ్చి, ఇప్పుడు కేవలం 31 శా తంతో సరిపెట్టడం సిగ్గుచేటన్నారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించినం దుకు నిరసనగా ఈ నెల 19న రాష్ర్టవ్యాప్తంగా ఆం దోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో జాజుల మాట్లాడా రు.

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారులో ప్రభుత్వం బీ సీల పొట్టకొట్టిందని జాజుల గణాంకాలతో సహా వివరిం చారు. రాష్ర్టం లో మొత్తం 121 మున్సిపల్ చైర్మన్ స్థానాలు ఉండగా, 60 శాతం జనా భా ఉన్న బీసీలకు దక్కింది కేవ లం 38 స్థానాలు 31% మాత్రమే. అదే కేవలం 15 శాతం జనాభా ఉన్న అగ్రవర్ణాలకు మాత్రం ఏకం గా 61 స్థానాలు కట్టబెట్టారు. ఇది ఎక్కడి న్యాయమని ఆయన ప్రశ్నిం చారు. మొత్తం 2,704 కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాలకు ఎన్నికలు జరుగు తుండగా.. బీసీలకు కేటాయించింది 763 (28%) మాత్రమే అన్నారు.

10 కార్పొరేషన్లలో బీసీలకు దక్కిం ది 3 స్థానాలు 30% మాత్రమే అని చెప్పారు. గత 2020 ఎన్నికల్లో బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు అమ లు కాగా, ఈసారి అది 31 శాతానికి పడిపోయిందని జాజుల మండిపడ్డారు. హామీ ఇచ్చినట్లు 42 శాతం అమలు చేసి ఉంటే బీసీలకు 52 చైర్మన్ సీట్లు, 1150 కౌన్సిలర్ సీట్లు దక్కేవని, ప్రభుత్వ మోసం వల్ల వందల పదవులను బీసీలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మక్క-సారక్క జాతర వద్ద జరిగే రాష్ర్ట కేబినెట్ సమావేశంలో బీసీలకు జరిగిన అన్యాయంపై చర్చించి, 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ బీసీ ద్రోహిగా మిగిలిపోతుందన్నారు. బీసీల గురించి మాట్లాడకుండా, ఎన్ని కలకు సై అంటున్న బీజేపీ, బీఆర్‌ఎస్ల తీరును కూడా ఆయన తప్పుబట్టారు. 

సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, మహిళా సంఘం అధ్యక్షురాలు బి. మణి మంజరి, గ్రేటర్ అధ్యక్షులు మాదేశి రాజేందర్, నేతలు జెల్ల నరసింహ, గూడూరు భాస్కర్, గజ్జల సత్యం తదితరులు పాల్గొన్నారు.