calender_icon.png 27 December, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురువర్యా.. ఇదేమీ బుద్ధీ..!

27-12-2025 12:00:00 AM

  1. ఏకాంత మందిరాలుగా  విద్యాలయాలు.?

ముందే తెలిసినా స్పందించని అధికారులు.

ఇప్పటికీ చర్యలకు వెనకడుగు.

భర్తను హతమార్చిన ఉపాధ్యాయుల ఘటనలో కొత్తకోణం

పోలీసుల ధర్యాప్తుపై.. ఎన్నో సందేహాలు. 

నాగర్ కర్నూల్ డిసెంబర్ 26 (విజయక్రాంతి): అచ్చంపేట ’కామాతురాణాం.. న భయం న లజ్జ’.. ఈ వర్ణణ ఇటీవల.. భర్తను హత్య చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులైన భార్య, ఆమె ప్రియునికి సరిగ్గా సరిపోలుతుంది. బలపం పట్టి విద్యార్థులను భావితరాలకు మార్గదర్శకులను తయారు చేయాల్సిన ఇద్దరు ప్రభుత్వ ఉపాద్యాయులు. ‘కామం‘ అనే వ్యామోహంలో పడి చివరికి అందరూ ఆధరించే గురువు వృత్తికే కలంకం తెచ్చారు.

గత నెల 25న అచ్చంపేటలోని మారుతినగర్ కాలనీలో భర్త లక్ష్మన్ నాయక్ను హత్య చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులైన భార్య పద్మ, ప్రియుడు రాత్లావత్ గోపి వ్యవహరంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది కాలంగా తమ నీచమైన వ్యవహారాన్ని కొనసాగిస్తున్న విషయం విద్యాశాఖలోని కొంత మందికి ముందుగానే తెలుసనే చర్చ జోరుగా జరుగుతోంది. దీనికి తోడు ప్రేమికులిద్దరూ అప్పట్లో పనిచేసిన ఓ పాఠశాలలోని తరగతి గదినే తమ ఏకాంత మందిరంగా మార్చుకున్నారనే ఆరోపణలు భాహాటంగా వినిపిస్తున్నాయి.

దీన్ని గమనించిన గ్రామస్థులు, విద్యార్థులు అప్పట్లోనే పాఠశాల హెచ్‌ఎం ద్వారా విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాదన వినిపిస్తోంది. దీనికి తోడు ఆయా ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఉన్నతాధికారులకు ఒత్తిడి తెచ్చినట్లు చర్చ జరుగుతుంది. వత్తిడి మేరకు కేవలం ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీ చేశారే కానీ.. వారిపై శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోలేదనేది అందరిలోనూ జరుగుతున్న చర్చ. ఒక వేళా విద్యాశాఖ అధికారులే ముందస్తు చర్యలు తీసుకుంటే.. హత్యకు దారితీసే పరిస్థితులు మూసుకుపోయేవని చెబుతున్నారు.

పైగా హత్య చేసిన పద్మ ఇప్పటికీ కొంత దూరంలోనే రాంనగర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా కొనసాగుతుండటం గమనార్హం. దీన్ని బట్టే విద్యాశాఖ అధికారులు ఎంత మొద్దు నిద్రలో ఉన్నారో తెలుస్తోంది. హత్య జరిగిన అనంతరం కూడా వారిపై చర్యలు తీసుకోకుండా కొంతమంది ప్రభుత్వ టీచర్లే వారిని వెనకేసుకొచ్చారన్న వాదన వినిపిస్తోంది. 

 విచారణలోనూ జాప్యమా..

హత్య జరిగి నెల రోజులు గడిచిన తర్వాతనే పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు మీడియాకు కేవలం ప్రకటన రూపంలో వెల్లడించారు. అంతేకానీ హత్యకు దారితీసిన వాస్తవ వివరాలేంటో బహిర్గతం చేయలేదు. పైగా హత్యలో భాగస్వాములైన మరి కొందరిని రాజకీయ, సంఘాల ఒత్తిళ్లతో తప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లా స్థాయి పోలీసు ఉన్నతాధికారులు అక్షింతలు వేయడంతో ఆలస్యంగా చేరుకున్న స్థానిక పోలీసులు ఆగమేఘాల మీద కోర్టులో హాజరు పరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు నుంచి తప్పించేందుకు భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారాయి అన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఘటనపై లోతైన విచారణ చేస్తనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.