27-12-2025 12:33:41 AM
ఒక్కో వైన్ షాప్ నుంచి రూ.2.5 లక్షలు ఇవ్వాలంటూ టార్గెట్
కరింనగర్,డిసెంబర్26(విజయక్రాంతి): ఉమ్మడి కరింనగర్ జిల్లాలో287మద్యం దుకాణాలున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీ ప్రారంభమైంది. సర్పంచ్ ఎన్నికలు రావడంతో అ మ్మకాలు పెరి గాయి. డిసెంబర్31 అమ్మకా లు పెరగనున్న సమయం ను దృష్టిలో ఉం చుకొని రెండేళ్ల కు ఒక్కో ఒక్కో షాపు వారు రెండున్నర లక్షల రూపాయలు ఇవ్వాలని హుకుంజారీ చేస్తున్నారు.
మళ్లీ నెల నెల రూ.15వేలు ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు ఆక్రమ వసూళ్లకు తెరలేపుతున్నారు... దీంతో కొత్తగా మద్యం వ్యాపారంలోకి వచ్చిన వా రు ఆందోళన చెందుతున్నారు.ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు కోట్ల రూపాయల వ సూలు కు తెరలేపారు.కొత్తగా వైన్ షాప్ దక్కించుకున్న సంతో షం.. మద్యం వ్యాపారుల్లో ఉండటం లేదు. ఇప్పటికే షాప్ కోసం అద్దెకు తీసు కోవడం... ఫస్ట్ క్వార్టర్ డబ్బులు చెల్లించడం, ఫర్నిచర్ తయారు చే యించడం ఇలా ఇప్పుడే సర్దుకుంటున్న సమయంలోనే అధికా రులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
కొందరు ఎం దుకు తలనొప్పి అని డబ్బులను ఎక్సైజ్ అధికారు లకు ముట్టచెప్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులే కాకుండానే ప్రతి నెలా ఒక్కో వైన్ షాప్ గతంలో 10 బేలు ఉండగా ఇప్పుడు రూ.30వే లు ఇవ్వాలని ఎక్సైజ్ అధికా రులు చెప్పతున్నట్లు మద్యం వ్యా పారుల్లో జోరుగా చర్చసాగుతోంది. వసూలు చేసిన డబ్బును కింది స్థాయి నుం చి పై అధికారి వరకు పంపకాలు జరుగుతాయని తెలిసింది.
గతంలో రూ.50 వేలు మా త్రమే వసూలు చేశారని పాత మద్యం వ్యా పారులు చెపుతున్నారు చాలా మంది అధికారుల ఆక్రమ వసూళ్లతో దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. నాలుగు విడతలుగా చెల్లి స్తాం సమయం ఇవ్వండి అని ఆడిగినా ప ట్టించుకోవడం లేదని కొందరు మద్యం వ్యా పారులు వాపోతున్నారు.సిరిసిల్ల,పేద్దపల్లి జి ల్లాల్లో ఎక్కువగా ఒత్తిడిఉంది.ఇవ్వకుంటే కేసుల్లో ఇరికిస్తారనే భయం కొందరిలో ఉండగా పై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్ధం అవుతున్నారు.
అలాంటిది ఏమి లేదు
మద్యం దుకాణాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు.. అలాంటి తప్పు డు పని చేయవద్దు. స్టేషన్ అధికారులతో సమావేశం ఏర్పాటు సూచిస్తాం. ఇప్పటివరకు నా దృష్టికి రాలేదు. అలాంటి వారి పై చర్యలు తీసుకుంటాం.
-శ్రీనిబాస్, ఈఎస్, కరింనగర్ జిల్లా