calender_icon.png 23 May, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మఠంపల్లి మండలాన్ని ఊహించనంత అభివృద్ధి చేశా

22-05-2025 12:54:16 AM

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మఠంపల్లి మే 21:మఠంపల్లి మండలాన్ని ఎవరు ఊహించనంతగా అభివృద్ధి చేసానని రాష్ట్ర నీటిపారుదల, పౌర సర ఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం సబ్ స్టేషన్ ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి రా ష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉ త్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ  ఈ సబ్ స్టేషన్ కి నేనే శంఖుస్థాపన చేసి నేనే ప్రారంభించటం ఇంత త్వరగా పూర్తి చేసి రైతులకి, ప్రజలకి మెరుగైన విద్యుత్ సేవలు అందించటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.మట్టపల్లి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడి అభివృద్ధి కి, భక్తులకి మౌలిక వసతులు ఏర్పాటు చేయుటకి 2 కోట్లు నిధులు మంజూరు చేయటం జరిగిందని,మఠంపల్లి మండలంలో 50 కోట్లతో మట్టపల్లి బ్రిడ్జి, 80 కోట్లతో హు జూర్ నగర్ నుండి మట్టపల్లి వరకు డబుల్ రోడ్, 3 కోట్లతో బక్కమంతులగూడెం నుండి అలిపురం వరకు రోడ్ , 10 కో ట్లతో చౌటపల్లి నుండి మేళ్లచెర్వు వరకు రోడ్, 4 కోట్లతో చౌటపల్లి నుండి అలిపురం రోడ్, 28 కోట్లతో అలింగాపురం నుండి అమరవరం వరకు రోడ్లు నిర్మించానని ఇలా ప్రజలకి మెరుగైన మౌలిక వసతులు  ఏర్పాటు కి నిరంతరం కృషి చేస్తు న్నాని తెలిపారు.

త్తిపోతల పథకం నిర్వహణలో రైతులు భా ద్యతగా భాగస్వాములు కావాలని,ఎత్తి పోతల పథకం వద్ద ట్రాన్స్ ఫార్మర్ లు,కాపర్ వైర్లు దొంగలించటం జరుగుతుందని, లబ్ధిదారులు భాధ్యతగా తీసుకొవాలని సూచించారు. ఎ త్తి పోతల పథకాలకి ఎమైనా మరమ్మత్తులు ఉంటే అధికారులకి  తెలియపర్చి చేపించాలని సూచించారు.చెన్నాయిపాలెం సబ్ స్టేషన్ ని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అలాగే మట్టపల్లి సబ్ స్టేషన్ ని వేరే  ప్రదేశం కి మార్చుటకి నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఆర్థివో శ్రీనివాసులు, ఎస్ ఈ ప్రాంక్లిన్, డి ఈ. వెంకట కృష్ణ య్య, మండల అధికారులు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  సాముల శివా రెడ్డి, కిషోర్ రెడ్డి, మాలోతు సక్రు నాయక్, సై దులు, ఎల్లారెడ్డి, మాజీ ఎంపీపీ లు, మాజీ జెడ్పీటీసీ లు, మా జీ సర్పంచ్లు, మాజీ ఎంపిటిసిలు కార్యకర్తలు పాల్గొన్నారు.