calender_icon.png 23 May, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లపై పట్టు సాధించిన యంత్రాంగం

22-05-2025 12:56:13 AM

యాదాద్రి భువనగిరి మే 21 ( విజయ క్రాంతి ); ధాన్యం కొనుగోళ్లు అంటేనే కత్తి మీద సాము లాంటిది. ధాన్యం రా కను బట్టి ముందుగా  అంచనా వేయడం, ముందస్తు ప్రణాళికలు చేపట్టటం ఒక ఎత్తు అయితే, ప్రణాళిక పరంగా ముం దుకు సాగుతున్న వరుణుడు కరుణించకపోతే అన్నదాత అతలాకుతలమైపోతాడు అన్నదాత శ్రమ వృధా కాకముందే ఆ రుగాలం కష్టం కళ్ళముందే కన్నీరు పెట్టించక ముందే అధికార యంత్రాంగాన్ని ప్రణాళిక బద్ధంగా నడిపించడంలో జిల్లా కలెక్టర్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు.

కంటి మీద కునుకు లే కుండా రోజువారి నివేదికలు తెప్పించుకుంటూ లోటుపాట్లను సవరించుకుంటూ అధికారులను క్షేత్రస్థాయిలో పరుగు పెట్టి స్తూ ధాన్యం  కొనుగోలు సజావుగా నిర్వహించి  విజయం సా ధించారు.అన్నదాతలు పండించే పంట కు మద్దతు ధర ఇవ్వాలని, రాష్ట్రప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు భు జస్కంధాన వేసుకోవడంలో యాదగిరి జిల్లా ముందంజలో నిలిచింది.

రైతన్నకు అండగా నేనున్నానంటూ రేయంబవళ్ళు కంటికి రెప్పలా కాపాడుతూ తేమ శాతం రాగానే కొనుగోలు చేస్తూ అదే రోజు రవాణా చేపడుతూ రైతు ఖాతాల్లో సొమ్ము జమ అయ్యే వరకు నిర్విరామ కృషి చేసిన ఘనత యాదాద్రి భువనగిరి కి దక్కింది.జిల్లా పాలకులు ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి సమర్థవంతంగా నడిపించేందుకు ప్రతి కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారులను నియమించారు.

నిత్యం నిర్వహణ కేంద్రం కొనుగోళ్లు పనితీరు తెలుసుకోవడంతో ఆయా కేంద్రాలను సందర్శిస్తూ అధికారులకు సిబ్బం దికి సూచనలు సలహాలు అందిస్తూ ముందుకు నడిపించారు.లారీల కొరత ఉండడంతో   టాస్క్ ఫోర్స్ సహకారంతో  హైవే పై వెళ్లే ఇతర ఖాళీ వాహనాలను సైతం మళ్లించి  ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకున్నారంటే రైతన్న పై చూపిన శ్రద్ధ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయగా మిగిలిన ధాన్యాన్ని కూడా కొనుగోళ్లు వేగవంతం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు.

ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో 500 కోట్లు జమ చేశారు. ఇంకను 40 నుండి 50 కోట్లు మాత్రమే జమచేయాల్సి ఉంది.అన్నమాటకు కట్టుబడే విధంగా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా సొమ్ము రైతు ఖాతాలో జ మ చేసేలా కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ తోపాటు అ వగాహన కల్పించారు.ధాన్యం కొనుగోళ్లలో చివరి గింజ వర కు కొనుగోలు చేస్తామని రైతులందరూ ధాన్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ధైర్యం చెప్పారు.

రైతన్నలకు ధాన్యం నాణ్యత పై ప్యాడిక్లీనర్లు అవసరం ఉన్నదని కలెక్టర్ దృష్టికి రావడంతో అత్యవసర యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి కేంద్రాలకు అందించడంతోరైతన్నలు సంతోషం వ్యక్తం చేశా రు. ఐకెపి , పిఎసిఎస్, ఎఫ్.పి.ఓ.ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతిరోజు సందర్శించి నిర్వహణ తీరును తనిఖీ చేశారు.ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా లేకపోవడంతో అధికారులను సిబ్బందిని అదనంగా నియమించాలని  హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాల ని కలెక్టర్ ప్రత్యేకించి అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు.

అకాల వర్షాలు ఉన్నాయన్న సూచనలతో 24 గంటలు అ ధికారులు అందుబాటులో ఉండాలని, అవసరమైనచోట 30 మంది ప్రత్యేక అధికారులను నియమించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ  ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లలను వేగవంతం చేస్తున్నారు.అకాల వర్షాలు పడుతున్నాయని రైతులు అధర్యపడవద్దని, ధైర్యం కోల్పోరాదని, ధాన్యం తడిసిపోకుండా పట్టాలు కాని, టార్పాలిన్లు కాని ఏర్పాటు చేసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

వర్షాలకు తడిసినా, ఆరబెట్టుకోవాలని, ఆరుగాలం కష్టించి పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని, చివరి ధాన్యం గింజ వరకు కొనుగోళ్లు నిర్వహిస్తామని, అధికార యంత్రాంగం మీ  వెంటే ఉండి నిర్విరామంగా కృషి చేస్తుందని రైతులకు కలెక్టర్ చెప్పడంతో రైతుల్లో ధైర్యం వచ్చింది.దాంతో రైతన్నలు ధాన్యం నాణ్యతపై దృష్టి పెట్టి కొనుగోళ్లకు సహకరించడంతో ధాన్యం  ప్రశాంతంగా సజావుగా కొనసాగుతున్నాయి.