calender_icon.png 2 May, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొబైల్స్‌ను రికవరీ చేసి బాధితులకు అందజేత

02-05-2025 01:27:00 AM

సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి 

పెద్ద శంకరంపేట, మే 1: మొబైల్ పోయిన వెంటనే ధైర్యని కోల్పోకుండా సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని  పెద్ద శంకరంపేట ఎస్త్స్ర శంకర్ తెలిపారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నా, గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకొని పోయిన వారు వెంటనే కేంద్ర  ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన  సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని తెలిపారు.

ఓకవేళ పోగొట్టుకున్న వ్యక్తులకు కంప్యుటర్ పరిజ్ఞానం లేనియెడల ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక పోలీసు అధికారిని ఈ పోర్టల్ కి భాద్యతాధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు. సమాచారాన్ని పోర్టల్ లో నిక్షిప్తం చేయగా తద్వారా  కోల్పోయిన ఫోన్ తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎవరన్నా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మితే కొనవద్దని సూచించారు. ఈ సందర్భంగా ఏడు మొబైల్ ఫోన్ లను బాధితులకు అప్పగించినట్లు తెలిపారు.