02-05-2025 01:28:57 AM
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): తెలంగాణ జెన్‌కోలో భారీ గా పదోన్నతులు, బదిలీలు జరిగాయి. జెన్‌కో సీఎండీ సందీప్‌కు మార్ సుల్తానియా ఇందుకు సం బంధించిన ఉత్తర్వులు జారీచేశారు.
జెన్‌కోలో ఎలక్ట్రికల్, మెకాని కల్, టెలికాం, కంప్యూటర్ విభాగాల్లో ఏఈగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న 170 మందికి, అలాగే 33 మంది ఏఏఈలకు తాత్కాలికంగా ఏడీఈలుగా పదోన్నతి కల్పించి..బదిలీ చేశారు. అలాగే సివిల్ విభాగంలో పనిచేస్తున్న 5గురు ఏఈ/ఏఏఈలకు ఏఈఈలుగా పదోన్నతి కల్పిం చి పోస్టింగ్ ఇచ్చారు.
ఇదిలాఉండగా..పలువురు సీఈ స్థాయి ఇంజి నీర్లను కూడా బదిలీ చేశారు. యా దాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) సీఈ (కన్‌స్ట్రక్షన్)గా ఉన్న జే సమ్మయ్యను విద్యుత్‌సౌధలో ప్లా నింగ్ సీఈగా బదిలీ చేశారు.
సౌర విద్యుత్ విభాగంలో సీఈగా ఉన్న వీ రమేశ్‌బాబును వైటీపీఎస్‌లో సీ ఈ (కన్‌స్ట్రక్షన్)గా నియమించారు. కేటీపీఎస్ స్టేజ్ 7లో ఎస్‌ఈగా పనిచేస్తున్న ఎం శ్రీనివాసరావును వైటీ పీఎస్ సీఈ (కన్‌స్ట్రక్షన్) పరిధిలోకి బదిలీ చేశారు.