calender_icon.png 2 May, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే డే స్ఫూర్తితో సార్వత్రిక సమ్మెకు సిద్ధం కావాలి

02-05-2025 01:29:23 AM

  1. కార్మికులను బానిసలుగా మార్చే కోడ్‌లను రద్దు చేయాలి 

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ 

మే డే సందర్భంగా జిల్లావ్యాప్తంగా సీఐటీయూ జెండా ఆవిష్కరణలు, పట్టణంలో ర్యాలీ

గజ్వేల్ / సిద్దిపేట్/ హుస్నాబాద్/ చేర్యాల, మే 1: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే ను స్ఫూర్తిగా తీసుకొని మే 20న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ గారు పిలుపునిచ్చారు. 139 వ  అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా గజ్వేల్  సిద్దిపేట్ హుస్నాబాద్, చేర్యాల  డివిజన్,  మండల కేంద్రాలలో   మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు జెండాను ఆవిష్కరించి ర్యాలీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గజ్వేల్లో నిర్వహించిన సభలో  సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ  ప్రసంగించారు.  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దుచేసి బానిసలుగా మార్చే విధంగా కోడులు రూపొందించడం జరిగిందని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు వంద సంవత్సరాలు పాటు కొట్లాడి ఎనిమిది గంటల పని విధానం సాధించుకుంటే, మోడీ ప్రభుత్వం 12 గంటలు పని చేయాలని చట్టాలు తయారు చేస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు తక్కువ ధరలకు అమ్మేయడం జరుగుతుందని, కార్పొరేట్ లాభాల కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రజల మధ్యన కులం పేరుతో,  మతం పేరుతో ఐక్యతను విచ్చిన్నం  చేసి మభ్య పెడుతుందన్నారు. నిత్యవసర సరుకుల ధరలు పెరిగి ఆకాశాన్ని అంటుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, కనీస వేతనాలు పెంచడం లేదని విమర్శించారు.

మే డే సందర్భంగా పట్టణంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వద్దకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు  సందబోయిన ఎల్లయ్య,బండ్ల స్వామి, రంగారెడ్డి,వేణుగోపాల్, చెంద్రశేఖర్ రెడ్డి, రాజు, కుమార్, ప్రవీణ్, స్వామి, ఎల్లయ్య, గౌస్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

నారాయణఖేడ్‌లో

నారాయణఖేడ్ , మే 1: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని స్థానిక ఏరియా వైద్యశాలలో మేడే దినోత్సవ కార్యక్రమాన్ని గురువారం నాడు ఏఐసిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐటియుసి జెండాను ఎగురవేశారు. ఏఐటియుసి జిల్లా నాయకులు చిరంజీవి, పుప్పాల అశోక్ లు మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మికుల చట్టాలను తీసుకొచ్చి కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సమస్యలపై తమ సంఘం నిరంతరం పోరాటాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్, దత్తు రెడ్డి ,లక్ష్మణ్,గణేష్ ,కాశీనాథ్, నరసమ్మ ,ఆనంద్,రాజు,నర్సింలు, సురేఖ సాయమ్మ తదితరులుపాల్గొన్నారు.