calender_icon.png 23 May, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి

02-05-2025 12:13:10 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, మే 1 (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ర్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు రైతుల అకౌంట్ లో ధాన్యం డబ్బులు పడేలా జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు లు ఎలాంటి అదనపు తాలు ,తూకం పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టవద్దని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏదైనా ఇబ్బందులు సమస్యకు సలహాలు సూచనల కోసం రైతులు టోల్ ఫ్రీ నెంబర్  1800 4250 0333  కి కాల్ చేసి పిర్యాదు చేయవచ్చని తెలిపారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగు నీరు, రాత్రి వేళ ఇబ్బందులు లేకుం డా విద్యుత్ దీపాలు ఉండేలా చూ సుకోవాలని మంత్రి ఆదేశించారు.