12-07-2025 02:03:06 AM
భాష్యం స్కూల్ జెడ్‌ఈవో మార్కండేయులు
ఏఎస్ రావు నగర్, జూలై 11: విద్యార్థులు విద్యతో పాటు ఇతర అన్ని రంగాల్లోనూ రాణించాలని భాష్యం స్కూల్ జెడ్‌ఈఓ మార్కండేయులు సూచించారు. శుక్రవారం ఏఎస్ రావు నగర్ లోని భాష్యం స్కూల్లో జరిగిన ప్రెషర్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కండేయులు మాట్లాడుతూ.. విద్యార్థులు విద్య అభ్యసించడంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల్లో పాల్గొనాలనీ కోరారు.
అందుకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయవలసిన బాధ్య త ఉపాధ్యాయుల మీద ఉందన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అమరేశ్వర్ రావు, ప్రధానోపాధ్యాయురాళ్ళు స్వాతి, వనిత మేరీ పాల్గొన్నారు.