calender_icon.png 23 September, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళిత బిడ్డకు ఎంబీబీఎస్ సీటు

23-09-2025 12:38:41 AM

గుండాల సెప్టెం బర్ 22 (విజయ క్రాంతి) : యాదాద్రి భువనగిరిజిల్లా గుండాల మండలం పాచిల్ల గ్రామానికి చెందిన దళిత బిడ్డ పందుల రాఘవ ను నీట్ 2025 ఎంట్రన్స్ పరీక్షలో ఎంబిబిఎస్ సీటు వరించింది.  జనగాం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఫ్రీ ఎంబిబిఎస్ సీటు సాధించాడు.

పందుల కవిత శ్రీను దంపతులు  సాధారణ వ్యవసాయ కూలీగా పనులు చేస్తూ తన కొడుకుకు నీట్ కోచింగ్ ఇప్పించారు. తండ్రి కష్టానికి ప్రతిఫలంగా మెడికల్ సీట్ సాధించి కుటుంబంలో ఆనందం నింపాడు. భార్గవ్ పది, ఇంటర్ గుండాల ఆదర్శ పాఠశాల, కళాశాలలో పూర్తి చేశాడు. ప్రతిభ పట్టుదల ఉంటే పేదరికం అడ్డు కాదని  నిరూపిం చాడు.

ఎంబిబిఎస్  సీటు సాధించిన భార్గవ్ ను కుటుంబ సభ్యులు, తాను చదివిన పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ జి రాము మరియు ఉపాధ్యాయులు అభినందించారు .ఈ సందర్భంగా భార్గవ్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో కష్టపడి చదివితే ఏదైనా సాధించగలమని తెలిపారు.