29-11-2025 12:32:50 AM
ఇమ్రాన్ ఖాన్ కుమారుడు కాసీం డిమాండ్
ఇస్లామాబాద్, నవంబర్ 28: ‘నా తండ్రి, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బతికున్నట్లు ఆధారాలు చూపించాలి’ అని ఆయన కుమారుడు కాసీం ఖాన్ పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇమ్రాన్‌ఖాన్ చనిపోయినట్లు వస్తోన్న వార్తలను ఆ దేశ ప్రభుత్వం ఖండించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ‘డెత్ సెల్’ గురిం చి కాసీం ఆరోపిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా తను సజీవంగా ఉన్నట్లు రుజువు కావాలని డిమాండ్ చేశాడు.
తన తండ్రికి ఏదైనా హానీ జరిగితే తీవ్ర పరరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించాడు. ఈ మేరకు తన తండ్రి గురించి పట్టించుకోవాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘా లు, ప్రజాస్వామ్య దేశాలను కోరుతూ ఆయన ‘ఎక్స్’లో శుక్రవారం పోస్ట్ చేశాడు. ‘నా తండ్రిని ఆగస్టు 2023 నుంచి రాజకీయంగా, అవినీతి ఆరోపణలపై జైలులో ఉచారని, అతపై అడియాలా జైలులోని ‘డెత్ సెల్‘లో ఆరు వారాల పాటు మొత్తం ఏకాంత నిర్బంధాన్ని విధించారని ఆరోపించారు.