calender_icon.png 12 July, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెహదీపట్నం ఆర్టీవోను భర్త రఫ్ చేయాలి

12-07-2025 12:00:00 AM

జేటిఓకు తెలంగాణ ప్రోగ్రెసివ్ అండ్ ఆటో మోటార్స్ వర్కర్స్ యూనియన్ వినతి 

ఖైరతాబాద్, జూలై 11 (విజయ క్రాంతి) : మెహదీపట్నం ఆర్టీవో గంధం లక్ష్మిని ఉద్యోగం నుంచి బర్తరఫ చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ అండ్ ఆటో మోటార్స్ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈమెరకు శుక్రవారం ఖైరతాబాద్ కార్యాలయంలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

అనంతరం యూనియన్ సభ్యులు మాట్లాడుతూ. కొత్త పర్మిట్ల కోసం ఆధార్, లైసెన్స్‌లో ఒకే  అడ్రస్ ఉండాలని లేనియెడల సంబంధిత ఆర్టీవో కార్యాలయంలో అడ్రస్ చేంజ్ చేసుకోవాలని రవాణా శాఖ కొత్త ఆర్డినెన్స్ ను తీసుకురావడం జరిగింది అని తెలిపారు. ఇందుకోసం నరసింహులు అనే ఆటో డ్రైవర్ స్లాట్ బుక్ చేసుకొని ఫీజు చెల్లించి సంబంధిత కౌంటర్ కు వెళ్లడంతో ఫైల్ ను తిరస్కరించడం జరిగింది అని తెలిపారు.

ఇదేమిటని కౌంటర్లో వ్యక్తిని ప్రశ్నించగా పెళ్లి ఆర్టీవో ని కలవండి అని సమాధానం చెప్పినట్లు తెలి పారు. అట్టి ఫైల్ ని తీసుకొని సంబంధిత ఆర్టీవో  వద్దకు వెళ్లగా ఆమె ఇన్ని సంవత్సరాల తర్వాత అడ్రస్ మార్చుకోవాల్సిన అవసరం ఏముం ది అని దురుసుగా మాట్లాడిందని తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకే తమ దగ్గరకు వచ్చామని విన్నవించగా అయితే కమిషనర్ ని వెళ్లి అడగండి అని తురుసుగా సమాధానం చెప్పిందని తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ను కలిసి ఆర్టీవోను భర్త రఫ్ చేయాలని కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు జి లింగం గౌడ్, ప్రధాన కార్యదర్శి వి ప్రవీణ్ , కోశాధికారి టి నారాయణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.