calender_icon.png 24 October, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సేవ కార్యక్రమాలు అంతులేని ఆనందాన్ని ఇస్తాయి

23-10-2025 08:11:30 PM

ఉచిత వైద్య శిబిరంలో 800 మందికి వైద్య పరీక్షలు..

ఘట్ కేసర్ (విజయక్రాంతి): ప్రజా సేవ కార్యక్రమాలు అంతులేని ఆనందానికి ఇస్తాయని వైఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ ఎదులాబాద్ లో వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శివరంలో 800 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరానికి ముఖ్య అతిథిగా మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజ హాజరై వైఎస్ఆర్ ట్రస్ట్ వారి సేవలను గురించి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాలే తమకి అంతులేని ఆనందాన్ని అందిస్తుందన్నారు. 

ముఖ్యంగా ఉచిత వైద్య శిబిరంలో క్యాన్సర్ పై అవగాహన స్క్రీనింగ్ పరీక్షలు చేయడం వలన ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. 800 మందికి పైగా ఎదులాబాద్ ప్రజలు ఈవైద్య శిబిరంలో కాన్సర్, కంటి, దంత, సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగిందన్నారు. కావాల్సిన వారికి ఉచిత మందులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈకార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పిట్టల శ్రీశైలం, డాక్టర్ పృద్వి, మాజీ ఎంపిటిసి గట్టగళ్ల రవి, బిజెపి సీనియర్ నాయకులు బట్టే లక్ష్మణ్, మురళి, రాజేష్, నాగరాజు, యుగేందర్ గౌడ్, వైయస్ రెడ్డి ట్రస్ట్ సభ్యులు, యువకులు మహిళలు పాల్గొన్నారు.