calender_icon.png 24 October, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాటయోధుడు వ‌డ్డె ఓబన్న

23-10-2025 08:14:04 PM

భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు..

భద్రాచలంలో ఘనంగా వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ..

పాల్గొన్న వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు..

భద్రాచలం (విజయక్రాంతి): భారతదేశంలో బ్రిటిష్ వలస పాలకుల ఆగడాలను, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం జరిపిన యోధుడు వడ్డే ఓబన్న అని శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు అన్నారు. వడ్డే రాజుల సంఘం భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బండారు నాగేశ్వరరావు అధ్యక్షతన గురువారం వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరావుతో పాటు రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేటి జైపాల్, వడ్డె రాజుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి అంతయ్య పాల్గొని మాట్లాడుతూ భద్రాద్రిలో వడ్డే రాజుల విగ్రహం ఏర్పాటు హర్షనియమన్నారు. శిస్తులు వసూలు విషయంలో బ్రిటీష్‌ ఈస్టు ఇండియా కంపెనీ అధికారులకు, రేనాటి పాలెగాళ్లకు మధ్య ప్రారంభమైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయన్నారు. నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాటం ఇందులో ముఖ్యమైందన్నారు.

ఈ పోరాటంలో సైన్యాధ్యక్షుడిగావున్న వడ్డే ఓబన్న వీరోచిత పాత్రను పోషించారని, వడ్డెర్లు, బోయలు, చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని 10 వేలమందితో ఏర్పాటు చేసుకొని బ్రిటీష్‌ సైన్యంతో వీరోచితంగా పోరాడిన మహోన్నత వ్యక్తి వడ్డే ఓబన్న అని అన్నారు. బ్రిటీష్‌ పాలకుల దౌర్జన్యానికి వ్యతిరేఖంగా వడ్డే ఓబన్న చేసిన పోరాట పటిమను భవిష్యత్‌ తరాలకు ఆదర్శమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డె రాజుల సంఘం జిల్లా అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు, భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బండారు నాగేశ్వరరావు, బండారు వెంకట రమణయ్య, బత్తుల నరసింహులు, బత్తుల తిరుపతయ్య, బత్తుల రామారావు, గుంజ చెన్నకేశవ, యువజన అధ్యక్షులు బండారు కృష్ణ, తమ్మిశెట్టి రాము, దండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.