calender_icon.png 24 October, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదాలకు కారణమవుతున్న ముండ్ల పొదల తొలగింపు..

23-10-2025 08:08:54 PM

సీఐ వెంకటేశ్వర రావు..

బోథ్ (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రహదారికి అడ్డంగా వచ్చిన చెట్ల పొదలను తొలగించామని బోథ్ సీఐ వెంకటేశ్వర రావు అన్నారు. బోథ్ మండల కేంద్రం నుండి పొచ్చేర క్రాస్ రోడ్డు వరకు రోడ్డుకు అడ్డంగా ముండ్ల పొదలు పెరిగాయని, పెరిగిన చెట్ల కొమ్మలతో వాహనదారులు ప్రమాదాలకు గురవడంతో పాటు తరచుగా విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కల్గుతున్నందున  గురువారం బోథ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ సౌజన్యంతో అటవీశాఖ, ఆర్&బీ, విద్యుత్ శాఖల అధికారులతో పాటు బోథ్ కు చెందిన సామాజిక కార్యకర్త చట్ల ఉమేష్ సహకారంతో రోడ్డుకు అడ్డంగా వచ్చిన చెట్లను తొలగించామని ఆయన అన్నారు. చెట్ల తొలగింపు ప్రక్రియకు ఉచితంగా జేసీబీ వాహనాన్ని అందించిన చట్ల ఉమేష్ ను ఈ సందర్భంగా వారు అభినందనలు తెలిపారు.

బోథ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ పిలుపుతో చెట్ల తొలగింపు ప్రక్రియకు జేసీబీ వాహనాన్ని ఉచితంగా సమకూర్చిన చట్ల ఉమేష్ ను సొసైటీ సభ్యులు సన్మానించారు. ఈ మార్గం గుండా రాకపోకలు కొనసాగించే  వాహనదారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మహత్తర కార్యక్రమానికి చేపట్టడానికి ముందుకు వచ్చి వివిధ శాఖలను సమన్వయం చేసిన బోథ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ అధ్యక్షుడు షేక్ అలీ, సభ్యులకు వివిధ శాఖల అధికారులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ బోథ్ రేంజ్ అధికారి ప్రణయ్, ఎంపీడీఓ రమేష్, ఎస్ఐ శ్రీసాయి, అటవీశాఖ సిబ్బంది, ఆర్&బీ, విద్యుత్ శాఖ సిబ్బందితో పాటు బోథ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు వెండి పృథ్వి, అబ్దుల్ రావుఫ్ తదితరులు పాల్గొన్నారు.