calender_icon.png 24 October, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సువర్ణ్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

24-10-2025 12:50:08 AM

-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సలహాలు, సూచనలతో మెగా జాబ్ మేళా సర్వం సిద్ధం

 -సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

-యువత నైపుణ్యం ఉన్న రంగంలో విజయం సాధించాలి

- ఎస్పి నరసింహ 

హుజూర్ నగర్, అక్టోబర్ 23: ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ర్ట నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో జాబ్ మేళాకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని యువత భారీ సంఖ్యలో పాల్గొని సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. పట్టణంలోని పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్ నేషనల్ స్కూల్ లో నిర్వహించే జాబ్ మేళా ఏర్పాట్లను గురువారం జిల్లా ఎస్పి కొత్తపల్లి నరసింహతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను, నిర్వాహకులను  ఆదేశించారు. కంపెనీల వారీగా స్టాల్స్ కేటాయింపుల వివరాలను అందజేయాలనీ సింగరేణి ప్రతినిధి చందర్ ను ఆదేశించారు.రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద అభ్యర్థులు ఎక్కువగా నిలబడకుండా రంగాల వారీగా ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలని,డిగ్రీ కళాశాల, మార్కెట్ యార్డ్, స్వర్ణ వేదిక పంక్షన్ హాల్ ప్రక్కన ఉన్న వెంచర్ లను పరిశీలించి పార్కింగ్  ఏర్పాటు చేసి  కుర్చీలు ఏర్పాటు చేయాలని, రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద, భోజనాల వద్ద ఎవరికీ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చూడాలన్నారు.

జాబ్ మేళా ప్రాంగణానికి  అప్రో రోడ్లను వేయాలని, మొబైల్ టాయిలెట్స్, అభ్యర్థుల సౌక్యార్థం జిరాక్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.వర్షం కురిసిన వాటర్ ప్రూఫ్ టెంట్ లను జాబ్ మేళా ప్రాంగణం,స్వర్ణ వేదిక పంక్షన్ హాల్ ప్రాంగణం, పార్కింగ్ ప్రదేశాలలో ఏర్పాటు చేయాలన్నారు. తదుపరి ఎస్పి నరసింహ  మాట్లాడుతూ యువత నైపుణ్యం ఉన్న రంగంలో విజయం సాధించాలన్నారు.250 కంపెనీల హాజరుతో 20 వేలకు పైగా యువతీ యువకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయి పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి,ఆర్డీఓలు శ్రీనివాసులు,సూర్య నారాయణ, డిఎస్పి ప్రసన్న కుమార్,సింగరేణి ప్రతినిధి చందర్,జిల్లా ఉపాధి కల్పనాధికారి శంకర్, జి ఎం ఇండస్ట్రీస్ సీతారాంనాయక్, ఎస్సి కార్పొరేషన్ ఈడి శ్రీనివాస్ నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డిఎస్పీలు ప్రసన్నకుమార్,రవి, స్పెషల్ బ్రాం ఇన్స్పెక్టర్ రామారావు,సర్కిల్ ఇన్స్ స్పెక్టర్లు చరమందరాజు, రామకృష్ణారెడ్డి, ప్రతాప్ లింగం, ఎస్సులు మోహన్ బాబు, నరేష్, రవీందర్, బాబు, కోటేష్,ఏఐసిసి సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, చింతకుంట్ల లక్ష్మి నారాయణ రెడ్డి,దొంగరి వెంకటేశ్వర్లు,గెల్లి రవి,తన్నీరు మల్లిఖార్జున్,తదితరులు, పాల్గొన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

కోదాడ, అక్టోబర్ 23: నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని  కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. గురువారం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ర్ట పౌరసరఫరాల, ఇరిగేషన్ శాఖా మాత్యులు నల మాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్సెంజ్  సహకారంతో 150 కంపెనీలతో ఈ నెల 25న హుజూర్ నగర్ లో  మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 5000 ఉద్యోగాలు  పొందే అవకాశం ఉందని ఇట్టి అవకాశాన్ని  నిరుద్యోగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గాల  అభివృద్ధితో పాటు ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి తోడ్పాటు అందించాలని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.మెగా జాబ్ మేళా పై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే సూచించారు.జాబ్ మేళా సందర్భంగా నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాలంటీర్లు వ్యవహరించాలని కోరారు

సద్వినియోగం చేసుకోవాలి: తహసిల్దార్ శ్రీనివాసరావు 

నూతనకల్, అక్టోబర్ 23 : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో ఈ నెల 25న రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ శ్రీనివాసరావు కోరారు.గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారు నేరుగా జాబ్ మేళా స్థలానికి వెళ్తే, అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా వారి దరఖాస్తులను స్వీకరిస్తారని చెప్పారు.దరఖాస్తు చేసుకున్న వారికి వారి అరతను బట్టి టోకెన్ ఇస్తారని, ఈ టోకెన్ కలిగినవారు మాత్రమే లోనికి ప్రవేశించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ జాబ్ మేళా ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని, 18 నుంచి 40 సంవత్సరాలలోపు వయస్సు గలవారు మాత్రమే దీనికి అరులని పేర్కొన్నారు.?ఈ సమావేశంలో డిటి వంశీరాజ్, ఆర్‌ఐ హసన్ తదితరులు పాల్గొన్నారు.

జాబ్ మేళా బ్రోచర్ల ఆవిష్కరణ 

కోదాడ, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ర్ట నిరుద్యోగ యువత ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి కృషి చేస్తున్నారని ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయపూడి వెంకటనారాయణ అన్నారు ఈ నెల 25న హుజూర్నగర్ లో జరిగే మెగా జాబ్ మేళా కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లను కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సింగరేణి కాలేజెస్ కంపెనీ లిమిటెడ్ మరియు  %ఖిలిలిశి% సహకారంతో హైదరాబాద్ వెళ్లకుండానే హుజూర్నగర్ లో 150 ప్రైవేట్ సంస్థలు జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయనీ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు అందిపుచ్చుకోవాలని ఆయన కోరినారు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఉద్యమం జరిగింది నీళ్లు  నిధులు నియామకాలపైనే జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెరుమళ్ళ గాంధీ డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు టి పి ఓ ఐజాస్ విభాగాధిపతి రమేష్ మరియు  విద్యార్థినిలు పాల్గొన్నారు