calender_icon.png 29 July, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్

28-07-2025 08:34:37 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని సోమవారం ఆరోగ్య వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్(Commissioner Ajay Kumar) సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్య సేవలపై వాకబు చేశారు. మలేరియా, డెంగ్యూ విష జ్వరాల నియంత్రణకు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య సేవలను సమర్వయంతో అమలు చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆసుపత్రిని నిత్యం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆయన వెంట డి సి హెచ్ ఎస్ కోటేశ్వరరావు, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ జి రవి వైద్యులు, వైద్య విధాన పరిషత్ అధికారులు ఉన్నారు.