calender_icon.png 29 January, 2026 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినీ మేడారం జాతరలో వైద్య సేవలు మెరుగ్గా ఉండాలి

29-01-2026 12:00:00 AM

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.రవీంద్ర నాయక్ 

హనుమకొండ టౌన్, జనవరి 28 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని మినీ మేడారంగా పిలుచుకునే అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ బి. రవీంద్రా నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మార్గంలో కటాక్షపూర్ ఉచిత వైద్య శిబిరాన్ని, ఆత్మకూర్ పిహెచ్‌ఎస్ ని తనిఖీ చేశారు. అంతేకాకుండా మార్గమధ్యలో 22 వైద్య శిబిరాలలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలని, మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు.