29-01-2026 12:00:00 AM
మొయిన్‌బాద్ మున్సిపల్ పరిధిలో ఘటన
మొయినాబాద్, జనవరి 28(విజయక్రాంతి): స్కూల్ బస్ బోల్తా కొట్టి విద్యార్థుల కు గాయాలైన ఘటన మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని మృగవని పార్కు వద్ద చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బండ్లగూడ జాగీర్ లోని హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ స్కూలుకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి మొయినాబాద్ వెళ్తున్న సమయంలో మృగావని పార్కు వద్ద చేరుకోగా.
. ముందున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బస్సు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో విద్యార్థులు ఉన్నారు. ప్రమాదం కారణంగా పలు వురు విద్యార్థులు గాయపడడంతో వారిని స్థానిక ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. హైదరాబాద్- రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.