calender_icon.png 13 October, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సకాలంలో ప్రజలకు వైద్య సేవలు అందించాలి

13-10-2025 12:52:35 AM

కలెక్టర్ రాహుల్ రాజ్ 

వెల్దుర్తి అక్టోబర్ 12 : నిర్దేశిత వైద్య సేవలు సకాలంలో ప్రజలకు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నికలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపి రిజిస్టర్, సిబ్బంది హాజర పట్టిక, మందుల స్టాక్  రిజిస్టర్, ఆసుపత్రి పరిసరాలు పరిశీలించి వైద్యాధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

సీజనల్ వ్యాధుల కేసులు, వాటికి సంబంధించిన మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్లవేళలా వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణకు విశేష కృషి చేయాలని  కలెక్టర్ సూచించారు.