calender_icon.png 12 September, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్‌స్టోర్ల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలి

12-09-2025 12:57:25 AM

సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం,, సెప్టెంబర్ 11, (విజయక్రాంతి):ప్రజా ఆరోగ్య దృష్ట్యా మెడికల్ స్టోర్స్ సమర్థవంతమైన నిర్వహణ అత్యంత అవసరమని కలెక్టర్ జితేష్వి వి పాటిల్ అ న్నారు. రామవరం మాత శిశు ఆరోగ్య కేం ద్రంలోని సెంట్రల్ మెడికల్ స్టోర్ ను గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించి స మగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ యన స్టోర్లో నిల్వ ఉంచిన ఔషధాల లభ్యత, నాణ్యత, గడువు తేది, ఆసుపత్రులకు సరఫ రా ప్రక్రియలను పరిశీలించారు.

రోగులకు అవసరమయ్యే ఔషధాలు ఎల్లప్పుడూ సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, గడువు ముగిసిన మందుల ను తక్షణమే తొలగించి రికార్డులు సక్రమంగా నిర్వహించాలనీ అధికారులను ఆదేశించారు.తనిఖీ సందర్భంగా సెంట్రల్ మెడికల్ స్టోర్ సిబ్బంది కలెక్టర్ దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. ప్రధాన రహదారి నుండి స్టోర్కు వచ్చే రహదారి మరమ్మత్తులు చేయాలని,

స్టోర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మందుల నిల్వ రాకులు, బరువై న బాక్సులు ఎత్తడానికి అవసరమైన యంత్రాలను సమకూర్చాలని కోరగా స్పం దించిన కలెక్టర్ అవసరమైన అన్ని సదుపాయాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని హా మీ ఇచ్చారు. స్టోర్లోని ఒక హాల్ ఫ్లోరింగ్ పనులు పెండింగ్లో ఉన్న విషయాన్ని ఆయన గమనించారు.

ఈ పనులను పూర్తిచేయడానికి అవసరమైన వ్యయంపై తక్షణమే నివేది కలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించి, ఫ్లోరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి వాడుకలోకి తేవాలని సూ చించారు. కలెక్టర్ మాట్లాడుతూ అవసరమైన సదుపాయాల కల్పనలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. మందులు కొరత రాకుం డా సంబంధిత అధికారులు అవసరమైన ఇండెంట్లు సకాలంలో పంపించాలి, ప్రతి రోగికి అవసరమైన ఔషధాలు ఎప్పటికప్పు డు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని ఆయన సూచించారు.

ప్రతి అధికారికి, సిబ్బందికి ప్రజా ఆరోగ్యం అత్యున్నత ప్రాధాన్యతగా ఉండాలని, వైద్య రంగంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట సీనియర్ ఫార్మసీ అధికారి శారద, ఫార్మసిస్ట్ అధికారి రామచందర్, సెంట్రల్ మెడికల్ స్టోర్స్ సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.