calender_icon.png 12 September, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రిగారూ.. ఫలకం వెక్కిరిస్తోంది!

12-09-2025 12:55:43 AM

  1. వంతెన శంకుస్థాపనకు 8 నెలలు

నేటికి పనులకు అతిగతి లేదు

టెండర్ దక్కిన గుత్తే దారు పత్తాలేడు 

గుత్తే దారుకి నోటీసులు

అశ్వారావుపేట, సెప్టెంబర్ 11, (విజయ క్రాంతి): శంకుస్థాపనలతో సరి.... పనులు జరగవు మరి అన్నట్టుగా ఉంది అధికారుల పనితీరు. రాష్ట్ర మంత్రి శంకుస్థాపన చేసిన పనులకే అతి గతి లేకుండా పోతోంది. సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించిన ప్ర జలకు నిరాశే ఎదురవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కేసప్పగూడెం, మద్దికొండ గ్రామాల మద్య లో అల్లాడి వారి గుంపు సమీపం లోని రా ళ్ళవాగుపై గత ఏడాది డిసెంబర్ లో రూ. 3.65 కోట్ల రూపాయల వ్యయంతో హై లెవ ల్ బ్రిడ్జి నిర్మాణానికి రెవెన్యూ మంత్రి పొం గులేటి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు.

నిధులు కూడ సిద్ధంగా ఉన్నాయి. టెండర్లు సైతం ఖరారు అయ్యాయి. అంగట్లో అన్ని ఉన్నా... అల్లుడు నోటిలో శని అన్న చందనా పనులు దక్కించుకున్న గుత్తేదారు నేటికి ప నులు ప్రారంభించలేదు. 8 నెలలు గడుస్తు న్న పనులు ప్రారంభం కాకపోవటం తో ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల కన్నీళ్లు తుడవటానికి హడా వుడి గా శంకుస్థాపన చేశారని, నిర్మాణ పను లు ఎందుకు మొదలు పెట్టలేదో పట్టించుకొనే నాధుడే లేడని వాహనదారులు, ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు.

పనులు దక్కించుకున్న గుత్తేదారుకు రాష్ట్ర ప్రభుత్వం గతం లో చేసిన కాంట్రాక్ట్ పనుల బిల్లు ఇప్పటికీ చెల్లించలేదని, ఆ కారణంగానే టెండర్ దక్కించుకున్న వంతెన నిర్మాణ పను లు చేపట్టటం లేదని సమాచారం. ఈ పనులపై దృష్టి సారించడానికి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు లేకపోవటం తో అధికారులను అడిగే నాధుడే కరువయ్యారు. ఈ రహదారిలో బిటి రోడ్డు ఎప్పుడో నిర్మించా రు.

కానీ వంతెన నిర్మాణానికి గత డిసెంబర్ లో శంకుస్థాపన చేశారు. వర్షా కాలం నాటికి వంతెన నిర్మాణం పూర్తి అవుతుందని ఆశించిన ప్రజలకు , ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడం తో ఈ ఏడాది కూడా రాళ్ళవా గు మీద వర్షాకాలం లో ప్రయాణాలు సా గించే పరిస్థితి లేదు.

నెలలు గడుస్తున్న పంచాయతీ రాజ్ అధికారులు గుత్తేదారు పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందిం చి వెంటనే వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పంచాయతీ రాజ్ డి ఈ ఈ వివరణ,

దీనిపై పంచాయతీ రాజ్ డి ఈ ఈ శ్రీ ధరని వివరణ కోరగా రాళ్ళ వాగుపై వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.65 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని, టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయిం దని, పనులు దక్కించుకున్న గుత్తేదారు కు నోటీస్ ఇవ్వటం జరుగుతుందని, పనులు ప్రారంభించక పోతే టెండర్ రద్దు చేసి తిరిగి టెండర్లు పిలవటం జరుగుతుందని తెలిపారు.