calender_icon.png 10 November, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నాయిగూడెంలో పేదలకు అందని వైద్యం

10-11-2025 12:46:00 AM

--పాము కాటుతో బాలుడు మృతి

-- అందుబాటులో డాక్టర్ ఉండి ఉంటే ప్రాణం దక్కేది..!

---సెలవు దినాల్లో అసలే అందని వైద్య సేవలు

--బాలుడి మృతదేహంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కుటుంబ సభ్యులు

కన్నాయిగూడెం,నవంబరు9(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం కేం ద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వై ద్యఅధికారి సక్రమంగా విధులకు హాజరు కా కపోవడంతో ఏజెన్సీలోని పేద ప్రజలకు వైద్యం అందక ప్రాణాలు పోతున్నాయి. రా ష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో ముందు కు కొనసాగుతుంటే కొందరు వైద్య అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆశయం నీరు గారుతోంది.

అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే వైద్య సేవలు అందించే వై ద్యులు విధుల్లో లేక పోవటం,ఆసుపత్రిలోని సిబ్బంది వైద్య సేవలు అందించినా ఓ బాలు డు ప్రాణాన్ని కాపాడలేక పోయారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్ విధుల్లో ఎ ప్పటి నుంచో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇది పత్రికల్లో కథనాలు వచ్చిన ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా ఉన్నారు. క న్నాయిగూడెం మండలంలోని గూర్రేవూల గ్రామానికి చెందిన తిరునగిరి రాజు,సంగీత దంపతుల కుమారుడు హరినాథ్ (7)ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా విషసర్పం కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యు లు వెంటనే కన్నాయిగూడెం మండల కేం ద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొని వెళ్లారు.

స్థానికంగా విధుల్లో ఉం డవలసిన వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్స్ పాము కాటుకి యాంటీ డోస్ ఇంజక్షన్ లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో చేసేదేమి లేక నాటు వైద్యం (పసరు మందు)పోశారు అయినా వి షం విరుగుడు కాకపోవడంతో బాలుడి పరిస్థితి విషమించడంతో 108అంబులెన్సులో మెరుగైన చికిత్స పొందుటకు ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తరలించారు. ఏటూరునాగారంలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.

అందుబాటులో డాక్టర్ ఉండి ఉంటే ప్రాణం దక్కేది..!

కన్నాయిగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో డాక్టర్ ఉండి ఉంటే ప్రాణం దక్కేదంటూ కుటుంబసభ్యులు కన్నీరు ము న్నీరుగా విలపించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే నా కొడుకు ప్రాణాలు పో యాయని ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు,వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటంలేదని,ప్రథమ చికిత్సకు ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యసి బ్బంది సమాచారం మేరకు ఏటూరునాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ హాస్పిటల్ వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పో లీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి ఏటూరునాగారం, తుపాకుల గూడెం ప్రధాన రహదారిపై మృతదేహంతో సుమారుగా 2గంటలకు పైగా ధర్నా నిర్వహించారు.

బాలుడికి వైద్యం అందక మృతి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పాము కా టుతో వచ్చిన బాలుడికి వైద్యం అందలేదని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.24గంటలు వైద్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండల్సింది డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ని ర్లక్ష్యం ఏర్పడింది స్థానిక డ్యూటీ డాక్టర్ అభినవ్ ను విధుల్లో నుంచి సస్పెండ్ చేసి జిల్లా కలెక్టర్ విచారణ చేసి మృతుని కుటుంబాని కి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాం డ్ చేశారు.

 సెలవు దినాల్లో అటెండరే దిక్కు అందని వైద్య సేవలు

కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలలో ఆదివారం, సెలవు దినాల్లో వైద్యం అందని ద్రాక్షగా మారింది. వైద్యులు, సిబ్బం ది సమయపాలన పాటించడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ స్తోంది. గ్రామీణ, మారుమూల ఏజెన్సీ ప్రాంత ప్రజలు అనారోగ్యానికి గురైతే పట్టణానికి పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది.