calender_icon.png 30 August, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేశ్ విగ్రహాల కోసం వెళ్లి వరదలో చిక్కారు

30-08-2025 02:08:52 AM

3 రోజుల పాటు ఆరుగురి నరకయాతన

సురక్షితంగా బయటకు తెచ్చిన పారామిలిటరీ దళాలు

ఎల్లారెడ్డి, ఆగస్టు 29 (విజయక్రాంతి): భారీ వర్షాలకు కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లి కలాన్‌కు చెందిన ఆరుగురు యువకులు, చిన్నారులు గణేశ్ విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు హవేలి ఘన్‌వూర్ వెళ్తుండగా, స్థానిక నక్కవాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. తిరిగి వెళ్లే క్రమంలో పోచారం ప్రాజెక్ట్ వరదతో వంతెన తెగిపోయింది.

దీంతో వారు పోచంరాల్ గ్రామంలోనే మూడు రోజుల పాటు చిక్కుకుపోయారు. తిండీతిప్పలు లేకుండా ఇబ్బందులు పడ్డారు. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందడంతో విషయం తెలుసుకున్న నాగిరెడ్డిపేట పోలీస్, పారా మిలిటరీ సిబ్బంది సహాయంతో శుక్రవారం వారిని మెదక్ వైపు నుంచి గోపాల్‌పేట్‌కు తరలించారు. దీంతో వారి కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.