calender_icon.png 31 October, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్స్ అందుబాటులో ఉంచాలి

31-10-2025 01:05:57 AM

ఇంచార్జ్ తహసిల్దార్ శ్రీనివాస్

వెల్దుర్తి, అక్టోబర్ 30 : వెల్దుర్తి మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని వెల్దుర్తి తహసీల్దార్ శ్రీనివాస్ కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులతో ఏర్పాటు చేసిన  సమావేశంలో మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కొనుగోలు చేయాలని సూచించారు.

అన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్పలిన్స్ రైతులకు అందుబాటులో ఉంచాలని అన్ని సౌకర్యాలు కల్పించాలని సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్, సొసైటీ సీఈఓ అశోక్, రెవిన్యూ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, కొనుగోలు కేంద్రాల నిర్వాకులు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.