05-11-2025 01:17:40 AM
రైతులకు ఇబ్బందిలేకుండా పత్తి కొనుగోలు చేపట్టాలి
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్.నవంబర్ 4(విజయ క్రాంతి): రైతులకు ఇబ్బందులు కలు గకుండా పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ తో కలిసి జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు, సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో పత్తి కొనుగోలు, జిన్నింగ్ మిల్లులలో ఏర్పా ట్లు, కపాస్ కిసాన్ మొబైల్ యాప్ నిర్వహణ- రైతులకు అవగాహన, జిన్నింగ్ మిల్లులలో రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2025 సీజన్ పత్తి కొనుగోలుకు జిన్నింగ్ మిల్లుల యజమానులు, సి.సి.ఐ, మార్కెటింగ్ అధికారులు అవసరమైన ఏర్పా ట్లు పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో ఈ సీజన్ లో 3 లక్షల 30 వేల ఎకరాలలో పత్తి సాగు చేయడం జరిగిందని, 38 లక్షల క్వింటా ళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
పత్తికి మద్దతు ధర 8110 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని, జిల్లాలో 24 జిన్నింగ్ మిల్లుల ద్వారా సి సి ఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కపాస్ కిసాన్ యాప్ విని యోగంపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రతి జిన్నింగ్ మిల్లుల లో తనిఖీలు నిర్వహించి రక్షణ పరమైన ఏర్పాట్లను పరిశీలించాలని, మిల్లు నిర్వాహకులకు తగు సూచనలు చేయాలని తెలిపారు. మిల్లులలో పనిచేసే కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించాలని తెలిపారు.
కొనుగోలు కేంద్రాలలో రైతులకు త్రాగునీరు, నీడ మౌలిక వసతులు కల్పించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లతో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు, ముఖ గుర్తింపు యాప్, విద్యాబోధన, మౌలిక వసతుల కల్పన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యావ్యవస్థలు బలోపేతం చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఈ నేపథ్యంలో జూనియర్ కళా శాలలలో పూర్తి సదుపాయాలు కల్పించడం జరిగిందని, విద్యార్థుల సంఖ్య పెంపొందించే విధంగా కృషి చేయాలని తెలిపారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాలలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.కళాశాలలలో త్రాగునీరు, విద్యుత్, బెంచీలు, ఫ్యాన్లు, ఆర్. ఓ. ప్లాంట్ల ఏర్పాటు, మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
స్త్రీ నిధి రుణ లక్ష్యాన్ని సాధించాలి
స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ ప్రక్రియపై కలెక్టరేట్‌లో సెర్ప్ పి.ఎం. సుధాకర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారాం లతో కలిసి సెర్ప్ డి.పి.ఎం.లు, ఎ. పి. ఎం.లు, సీసీలతో బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాలు, యుడిఐడి పెన్షన్, నూతన గ్రూపులో ఏర్పాటు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ జిల్లాలో బ్యాంకు లింకేజీ లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేయాలని, స్త్రీ నిధి రుణ లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు.
ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద కోళ్ల పెంపకం, డైరీ ఫారం ఏర్పాటు, చేపల పెం పకం, సోలార్ విద్యుత్ యూనిట్ ఏర్పాటు, క్యాంటీన్ నిర్వహణలతో వ్యాపార అభివృద్ధికి ప్రోత్సహిస్తుందని, స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నూతన స్వయం సహాయక సంఘాలు ఏర్పాటుచేసి వారికి రుణ సదుపాయాన్ని కల్పించి అభివృద్ధి చెందేందుకు అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు.
ఉదయం వాంకిడి మండలం జైత్పూ ర్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జైత్పూర్ గ్రామం మొదటి విడత ఇందిరమ్మ మోడల్ గ్రామంగా ఎంపికైందని, ఇండ్ల ప్రారంభానికి సిద్ధం చేసుకోవాలని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పి. డి. వేణుగోపాల్, ఇంజనీరింగ్ అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదా రులు, ప్రాజెక్టు మేనేజర్లు, సహాయ ప్రాజెక్టు మేనేజర్లు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు ,మాధ్యమిక విద్యాశాఖ అధికారి రాందాస్,డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, మార్కెటింగ్ శాఖ అధికారి అశ్వక్ అహ్మద్, రవాణా శాఖ అధికారి రామ్ చందర్, సి సి ఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.